అమెరికా పార్లమెంట్ ‘యూఎస్ క్యాపిటల్’ఫై ట్రంప్ మద్దతుదారుల దాడి తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ట్విట్టర్, ఫేస్ బుక్ సహా కొన్ని నిషేధం విధించాయి.
అయితే తాజాగా ట్రంప్ అధికారం కోల్పోయి సైలెంట్ గా తన మానన తను ఉంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధాన్ని ఎత్తేయాలా? వద్దా? అనే విషయంపై ఫేస్ బుక్ ఓవర్ సైట్ బోర్డు సమావేశమైంది. త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని తెలిపింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని.. త్వరలోనే ట్రంప్ ఖాతాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
అయితే ట్రంప్ ఖాతాలను సోషల్ మీడియా సంస్థలు బ్లాక్ చేయడం మరో వివాదానికి దారితీసింది. కంటెంట్ ను సెన్సార్ చేయడంలో ఈ టెక్ కంపెనీలకు ఉన్న శక్తిపై వాదనలు ప్రారంభమయ్యాయి. వేళ్ల మీద లెక్కపెట్టే ఈ కంపెనీలు దేశంలోని ఎంతగా రాజకీయాలను శాసిస్తున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దేన్ని తొలగించాలి? దేన్ని వదిలేయాలి? ఇలా చేయడానికి వారు ఎవరు? అని డిమాండ్ వినిపిస్తుంది.
అయితే తాను సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం పెట్టుకుంటానని గతంలో ట్రంప్ ప్రకటించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లు అవసరం లేదని అన్నారు.మరి ఆ దిశగా ట్రంప్ సాగుతారా? లేదా నిషేధం తర్వాత వీటిల్లో కొనసాగుతారా? అన్నది చూడాలి.