హైదరాబాద్ లో రెండు రోజుల కింద వ్యాయామం చేస్తూ ఓ కానిస్టేబుల్ చనిపోయిన ఘటన మరిచిపోకముందే మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూడా ఇలానే మృతిచెందడం కలకలం రేపుతోంది.
ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఆదోనికి చెందిన 28 ఏళ్ల యువకుడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ శనివారం మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఇతడు పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆదోనిలో ఇంటి నుంచి పని చేస్తున్నాడు.
ఇటీవలే నిశ్చితార్థం కూడా జరగగా మరో నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడు. శనివారం ఉదయం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలోని జిమ్‌లో వ్యాయామం చేస్తున్నాడు. కొన్ని నిమిషాల పాటు వర్కవుట్ చేసిన తర్వాత అతను అసౌకర్యంగా భావించి, తన స్నేహితులతో బయటకు వచ్చాడు. అతని కోసం నీరు తీసుకురావడానికి అతని స్నేహితులు వెళ్లగా స్పృహతప్పి పడిపోయాడు.
సమీపంలోని వ్యక్తులు అతనికి సీపీఆర్ చేసి బతికించడానికి ప్రయత్నించినప్పుడు అతను స్పృహలోకి వచ్చాడు. కాని వెంటనే అతను మళ్లీ కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు వెంటనే ఆటోలో ఆదోని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గుండెపోటుతో అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ దుర్ఘటన గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. నెలరోజుల్లో పెళ్లి అనగా చనిపోయిన కుమారుడిని చూసి కన్నీరు మున్నీరయ్యారు.
ఈ రోజుల్లో స్థూలకాయులు, శారీరక వ్యాయామం లేని వారు మాత్రమే కాదు.. ఫిట్‌గా ఉన్నవారు, రోజూ వ్యాయామం చేసేవారు, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు, జిమ్‌కి వెళ్లి రోజువారీ వ్యాయామాలు చేసేవారు, చిన్నవారు కూడా గుండె సంబంధిత సమస్యలతో చనిపోవడం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. గతంలో కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు, ఇటీవల తారకరత్న 23 రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి గుండెపోటుతో మరణించారు.
మరుసటి రోజు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మేనల్లుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక నిన్న గుజరాత్‌లో పెళ్లి చేసుకోబోతున్న ఓ వధువు గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. కొద్ది రోజుల క్రితం ఓ వరుడు వివాహ వేదికపైనే కుప్పకూలిపోయాడు. ఇలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.