తాము వెళ్లాల్సిన చోటు కు వెళ్లకుండా దారితప్పడంతో గూగుల్ మ్యాప్ చూస్తూ బైక్ పై వెళ్తున్న ఒక సాఫ్టువేర్ ఇంజనీర్ ప్రమాదానికి గురై అశువులు బాశాడు. మరో ఇద్దరు యువతులు గాయపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లోని పీవీఎన్‌ఆర్ ఎక్సప్రెస్ హైవే పైన జరిగింది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా చిన్న గొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్ హైదరాబాద్ లోని పోచారంలో ఒక ఐటీ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ కు సమీపంలోనే ఒక టౌన్‌షిప్‌లో స్నేహితులతో కలిసి నివాసం ఉంటన్నాడు. వారాంతపు సెలవులు నేపథ్యంలో మే 13 శనివారం సాయంత్రం మూడు ద్విచక్ర వాహనాల పై 9 మంది మిత్రులు హైదరాబాద్ కు వచ్చారు. అక్కడ కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం చూశారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ కు వెళ్లారు. అక్కడ నుంచి దుర్గం చెరువులో తీగల వంతెన వద్దకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.
అయితే మిత్రులందరికీ హైదరాబాద్ కొత్త కావడంతో గూగుల్ మ్యాప్ పెట్టుకుని అది చూస్తూ బైకుల పైన మెహిదీపట్నం మీదుగా బయల్దేరారు. ఈ క్రమంలో రెండు బైకుల పై ఉన్న చరణ్ మిత్రులు ముందుకు వెళ్లిపోయారు.
ఈ క్రమంలో చరణ్ గూగుల్ మ్యాప్ చూస్తూ ఆరాంఘర్ వద్ద తన బైకు ను పీవీఎన్‌ఆర్ ఎక్స ప్రెస్ వైపు మళ్లించాడు. అయితే తాను రాంగ్ రూట్లో వెళ్తున్నానని గ్రహించి గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబరు 82 వద్ద ఎక్సప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు వెళ్లేందుకు తన బైకు ను మలుపుతిప్పాడు. అదే సమయంలో ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.
ఈ ఘటనలో బైకు నడుపుతున్న సాఫ్టువేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడ్డాడు. పైకి లేవలేని నిస్సహాయ స్థితిలో రక్తపు గాయాలతో అక్కడికి వచ్చిన వారి పాదాలు పట్టుకొని కాపాడమంటూ అర్థించాడు. పోలీసులు వచ్చి ఆస్పత్రి తరలించేదాకా రోడ్డు పైనే తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న లంగర్ హౌస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ సత్యనరేంద్ర ఘటనాస్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన చరణ్ ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మే 14న ఆదివారం ఉదయం మరణించాడు. స్వల్పగాయాలతో బయటపడిన ఇద్దరు యువతులు ప్రాథమిక చికిత్స అనంతరం వారి ఇళ్లకు వెళ్లిపోయారు.
కాగా చరణ్ కంటే ముందు రెండు బైకుల పై వెళ్లిన మిత్రులు తీగల వంతెన వద్దకు చేరుకున్నారు. చరణ్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చి ప్రమాద విషయం తెలుసుకున్నారు.
కాగా మెహిదీపట్నం–శంషాబాద్ వరకు ఉన్న 11.6 కిలోమీటర్ల పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో కార్లు, బస్సులు ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉంది. పోలీసుల పర్యవేక్షణ లోపంతో తేలికగా గమ్యం చేరాలని కొందరు ద్విచక్ర వాహనదారులు, ఆటోలవారు ఈ మార్గంలో రాకపోకలు సాగించడం ప్రమాదాలకు దారితీస్తోంది.