సోమేష్ ను సలహాదారుడిని చేసుకున్న కేసీఆర్

Update: 2023-05-09 19:57 GMT
సోమేష్ కుమార్.. మొన్నటి వరకూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. ఏపీకి కేటాయించిన ఈయన క్యాట్ కు వెళ్లి తెలంగాణలో కొనసాగుతున్నారు. కానీ కేంద్రం ఇటీవల హైకోర్టుకెక్కడంతో తనకు కేటాయించిన ఏపీకి బదిలీ అయిపోయారు. అయితే అక్కడ సీఎం జగన్ పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో వీఆర్ఎస్ తీసుకున్నారు. కేసీఆర్ పంచన చేరారు. ఇటీవల కేసీఆర్ తోపాటు మహారాష్ట్ర మీటింగ్ కు వెళ్లాడు. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ లో ప్రభుత్వ సలహాదారుడిగా చేరిపోయారు.

తాజాగా సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమించినట్లు తెలిసింది. దాదాపుగా నిర్ణయం కూడా ఖరారైంది. ప్రభుత్వం అఫీషియల్ గా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కొంత కాలంగా సోమేశ్ నియామకంపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నియమించినట్టు తెలిసింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో నియమించే ఛాన్స్ ఉందని, లేదా రెరా చైర్మన్ అయినా అప్పజెప్పవచ్చని, లేదటే ఎక్సైజ్ శాఖకు సలహాదారుగా నియమించవచ్చన్నని ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. ఇవన్నీ ఊహాగానాలైనా ఆయన మాత్రం సీఎం ముఖ్య సలహాదరుడిగా రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన సోమేశ్ కుమార్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయించిన సెంట్రల్ అడ్మినిస్టేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులతో 2022, డిసెంబర్ వరకూ తెలంగాణ ప్రాంతంలో కంటిన్యూ అయ్యారు. ఆయన తెలంగాణలో కొనసాగడంపై ప్రతిపక్షాలు చాలా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ కార్యక్రమాలలో సోమేశ్ కుమార్ ఎక్కువగా కలుగ జేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రతి పక్షాలు హైకోర్టులో ఒక పిటిషన్ వేశాయి. హై కోర్టు ఆయనను ఆంధ్రా కేడర్ లోకి వెళ్లాలని ఆదేశించింది. దీంతో ఆయన సంక్రాంతి-2023 ముందు ఆంధ్ర ప్రదేశ్ లో చేరి స్వచ్ఛంద విరమణ పెట్టుకున్నారు.

అయితే తెలంగాణ సీఎం ముఖ్య సలహాదారుడిగా తాజాగా నియామకం అయినట్టు తెలిసింది.  ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా మాజీ సీఎస్ రాజీవ్ శర్మ కొనసాగుతున్నారు. అయితే ఈయన కూడా తెలంగాణ ప్రభుత్వానికి మొదటి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. విరమణ తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన వీరిద్దరూ రిటైర్ అయినా కూడా తిరిగి ప్రభుత్వానికి, సీఎంకు ముఖ్య సలహాదారులుగా నియామకం కావడం విశేషం.

Similar News