హడావుడి కాదు కంగారు.. తెలంగాణ బీజేపీ లో ఏదో జరుగుతోంది?

Update: 2023-06-24 14:00 GMT
తెలంగాణ బీజేపీ లో ఏదో జరుగుతోంది.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి అథిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో హైదరాబాద్‌ నుంచి ఆయన హడావుడిగా బయల్దేరారు. మరోవైపు రాష్ట్రంలో పార్టీ పుంజుకోకపోవడం.. ఇప్పటికీ మూడో
స్థానమే అనేది ఖాయం కావడం పై బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా ఆరా తీస్తున్నారు. దీనికితోడు సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలిచారు. వీరిద్దరితో అధిష్ఠానం నిర్వహించనున్న భేటీలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక దెబ్బ..

ఒక్క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం మూడు పార్టీల భవితవ్యం నిర్ణయించడం అంటే ఇదేనేమో? కర్ణాటకలో గత నెల వెల్లడైన ఫలితాలు కాంగ్రెస్ కు జీవం పోశాయి. బీజేపీ కి ఓటమి తాలూకు దెబ్బ చూపాయి. తెలంగాణ అధికార పక్షం
బీఆర్ఎస్ వీటి మధ్య అంతా చూస్తూ కూర్చుంది. వాస్తవానికి కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ డల్ అయింది. అందులోనూ ఎన్నికలు దగ్గరపడుతుండగా.. పార్టీలో మరింత రాజకీయాలు ఎక్కువయ్యాయి. అసమ్మతి, అసంతృప్తి పెరుగుతోంది. వీటిని సరిచేయడం పై అధిష్ఠానం తలమునకలైంది. అందుకే అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు.

వారిద్దరూ ఉంటారా? వెళ్తారా?

తెలంగాణ బీజేపీ లో రెండు ముఖ్య పాత్రలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. వీరిద్దరూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వచ్చినవారు. ఈటలను చేరికల కమిటీ చైర్మన్ గానూ నియమించింది బీజేపీ. కానీ, ఈ ఇవ్దరూ ఇతర పార్టీల కు వెళ్తున్నారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకే వీరితో  పాటు కిషన్ రెడ్డినీ ఢిల్లీ పిలిచింది.  అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ను పిలిచారో లేదో తెలియలేదు. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాల కు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డి తో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించింది. మొత్తం మీద తెలంగాణ భాజపా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఎంత చేసినా ముందుకెళ్లదే..? కాంగ్రెస్ మాత్రం జోరు..

తెలంగాణ లో బీజేపీ ది మొదటి నుంచీ మూడో స్థానమే. అసలు అది కూడా కాంగ్రెస్ కాస్త డల్ అయిన సందర్భంలో పుంజుకున్నట్లు కనిపించింది. అధికార బీఆర్ఎస్ తో పోటీ పడుతున్నట్లుగా హంగామా చేసింది. ఇప్పుడు మాత్రం ఎన్నికలు నాలుగు నెలల్లో ఉన్నాయనగా.. కనీసం అన్ని సీట్లకు అభ్యర్థులూ లేని పరిస్థితి ఎదుర్కొంటోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం కర్ణాటక ఫలితంతో మాంచి ఊపు మీదకు వచ్చింది.  అసలే కేడర్ బలం ఉన్న పార్టీ కాంగ్రెస్. ఒక్కసారి ఊపు లోకి వచ్చిందంటే ఎవరిని నిలిపినా గెలిచే పార్టీ. మరిన్ని పెద్ద లకాయలు కూడా ఆ పార్టీ వైపు చూసే పరిస్థితి. అందుకే బీజేపీ తత్తర పడుతోంది. అన్నిటికి మించి ఆ పార్టీ పోటీగా నిలవాల్సిన సమయంలో అసమ్మతి చికా కు పెడుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థులే లేరంటే ఉన్నవారూ పక్క చూపులు చూస్తున్నారు.

Similar News