బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏం మాట్లాడినా.. వర్రీ వర్రీగా ఉంటోందనే కామెంట్లు ఆ పార్టీ నేత ల్లోనే వినిపిస్తున్నాయి. పార్టీని డెవలప్ చేయాలంటే.. ఆయన అను సరిస్తున్న మార్గాలు ఏంటో తమకు కూడా అంతుచిక్కడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం పొరుగున తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు .. పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అధికారం కోసం చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. అదే స్ఫూర్తి ఏపీలో కనిపించడం లేదు.
ఒక్క తెలంగాణ మాత్రమే కాదు.. అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ .. బీజేపీనాయకులు ఉద్యమంగ తీసు కుని.. పనిచేస్తున్నారు. ఇక, తమిళనాడులోనూ.. కనీసం 10 స్థానాల్లో అయినా.. విజయం దక్కించుకోవాల నే వ్యూహంతో నాయకులు కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు.
కానీ, ఏపీ విషయానికి వస్తే.. మాత్రం ఆ తరహా పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలావుంటే.. తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు లాజిక్కుకు చిక్కడం లేదని బీజేపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
తమకు అధికారం ఇస్తే.. వచ్చే ఐదేళ్లలో రాజధాని అమరావతిని నిర్మించి తీరుతామని.. సోము వారు ప్రక టించారు. ఇప్పటికే 1200 కోట్లను కూడా ఇచ్చామని.. అయితే.. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో వ్యవహరించిన తీరు బాగోలేదన్నారు. అందుకే.. ప్రజలు తమకు అధికారం అప్ప గిస్తే.. చెలరేగిపోతామని కూడా చెబుతున్నారు. అయితే.. దీనిపైనే సొంత పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పటికి అమరావతికి శంకుస్థాపన చేసి.. 6 సంవత్సరాలు పూర్తయ్యాయని.. మరి ఇప్పటి వరకు కేంద్రం తో రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఏదైనా చెబితే.. ఖచ్చితంగా దానిని ప్రజలు విశ్వసించేలా ఉండాలని కూడా అంటున్నారు.. అమరావతి రైతులు పాద యాత్ర చేస్తే.. దానికి మద్దతు ఇచ్చే విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించే వరకు ఎందుకు ఉన్నారని అంటున్నారు.
ఆది నుంచి కూడా అసలు అనుసరించిన వైఖరి కూడా ప్రజలకు పార్టీని చేరువ చేయలేక పోయిందని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. సోమువారి లాజిక్ సొంత పార్టీ నాయకులకే అర్ధం కావడం లేదని స్పష్టమైంది. ఇదీ.. సంగతి..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.