పదవి ఉండగా పనిచేసి ఉంటే.. పార్టీలైన్ కు అనుకూలంగా వ్యవహరించి ఉంటే.. ఈ బాధతప్పేది! అని బీజేపీ లో చర్చ సాగుతోంది. అది కూడా ఇటీవల పార్టీ చీఫ్ పదవి ని కోల్పోయిన సోము వీర్రాజు గురించే. కొన్ని రోజుల కిందట ఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి ఆయన ను తప్పించిన విషయం తెలిసిందే. దీనికి కారణాలు ఏమున్నాయనేది పైకి ఎవరూ చెప్పకపోయినా.. అంతర్గత చర్చల్లో మాత్రం.. వైసీపీ సర్కారు పై ప్రతిపక్ష అజెండాను ఆయన మరిచిపోయారనేది కీలకం.
అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్న జనసేన తో కలిసి ముందుకు సాగలేకపోయారని.. ఈగో ఫీలిగ్స్ పెట్టుకుని.. ముందుమీరా.. ముందు మేమా? అనే ఫార్ములా ను అవలంభించారని.. అందుకే జనసేన తో కలవలేకపోయార ని.. ఇది కూడా సోము వీర్రాజు పదవి పోవడానికి కారణమైందని బీజేపీ వర్గాల్లో ఇప్పటికీ చర్చ సాగుతోంది. సరే.. ఇదిలావుంటే.. తాజాగా కేంద్ర బీజేపీ కమిటీ లో సోము కు స్థానం దక్కిన విషయం తెలిసిందే.
అయితే.. చిత్రంగా ఆయన కు ఇప్పుడు జనసేన మిత్రపక్షం అనే మాట గుర్తుకు వచ్చినట్టుంది. దీంతో తాజాగా జనసేన కు అనుకూలంగా మాట్లాడారు. రెండు మూడు రోజులు గా ఏపీ లో జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్న సంగతి తెలిసిందే. వలంటీర్లు కేంద్రంగా పవన్ వ్యాఖ్యలు విమర్శల కు తావిచ్చాయి. దీంతో ఆయనకు కొంత ఊరడింపుగా.. తాజాగా సోము వీర్రాజు ఢిల్లీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది! అని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. వలంటీర్ల వ్యవస్థ పై తాము ఆది నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని.. ఇప్పుడు పవన్ ఇవే చెప్పారని కూడా అన్నారు. వలంటీర్ వ్యవస్థ అందరినీ దోచుకునేందుకు ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. అయితే.. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఏనాడూ పవన్ ను సమర్థించకపోవడంతో.. ఇప్పుడు పదవి పోయేసరికి.. జనసేన తో బీజేపీ పొత్తు ఉందనే విషయం గుర్తుకు వచ్చిందా? అనే ప్రశ్నలు బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.