ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీరియస్ కామెంట్లు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కమ్ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు. అధికార వైసీపీ -బీజేపీ మధ్య అవగాహన ఉందన్న వాదన ఈ మధ్యన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళ జగన్ సర్కారుపై పోరుకు జనసేనాని రోడ్ మ్యాప్ అడిగినా..దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవటంపై ఈ మధ్యనే పవన్ కల్యాణ్ తన ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. జగన్ సర్కారుపై బీజేపీ పోరు సరిగా లేదన్న వాదన అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. రంగంలోకి దిగారు సోము వీర్రాజు. తాజాగా ఉగాది సందర్భంగా ఏపీ సీఎం పైన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేవారు. రాజధానిగా అమరావతి నుంచి విశాఖకు మార్చేందుకు జగన్ ప్రయత్నాలపై ఆయన ఫైర్ అయ్యారు. కేంద్రం అమరావతిని రాజధానిగా పరిగణించి.. డెవలప్ మెంట్ కోసం నిధులు విడుదల చేయటాన్ని ప్రస్తావించారు.
కొత్తగా ఫ్లైఓవర్లు.. నేషనల్ హైవేలను నిర్మిస్తోందని.. రాజధాని డెవలప్ మెంట్ లో భాగంగానే ఎయిమ్స్ లాంటి సంస్థలు విజయవాడకు వచ్చిన వైనాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని ముఖ్యమంత్రిజగన్ చెప్పారు. కానీ.. ఇప్పుడు విశాఖకు పారిపోతున్నారు’’ అని హాట్ కామెంట్స్ చేశారు. తాను జగన్ సర్కారుకు వ్యతిరేకంగా రోజు మాట్లాడుతున్నట్లుగా చెప్పారు.
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని.. త్వరలోనే తమ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ఛార్జిషీట్ రూపంలో ఆందోళన కార్యక్రమాల్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేంద్రంలో మోడీతో బాగుంటారని చెప్పి.. రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎదగకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. తానీ విషయాన్ని ఏ ఒక్కరిని ఉద్దేశించి వ్యాఖ్యానించటం లేదన్నారు.
పట్టభద్రులఎన్నికల్లో పవన్ కల్యాణ్ కలిసి రాలేదంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై సోము నేరుగా స్పందించలేదు. తాను ఈ విషయంపై స్పందించనని.. వారి సహకారం లభించిందో.. లేదో మీరే ఆలోచించుకోవాలన్నారు. జనసేన - బీజేపీమధ్య పొత్తు ఉంటుందా? తెగిపోతుందా? అన్న వ్యాఖ్యలకు స్పందించిన సోము.. మీ కోరిక నెరవేరకపోవచ్చని వ్యాఖ్యానించటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.