సుదీర్ఘకాలంగా చర్చలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రథసారథి ప్రక్రియ తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీ నేతలకు సమాచారం చేరవేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ సీనియర్లు - టీడీపీని గట్టిగా ఎదుర్కునే నేతలు - పార్టీని బలోపేతం చేయగలిగే సామర్థ్యమున్ననాయకులు...ఇలా పలురకాలా వడపోతల అనంతరం ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా ఇటీవల మారిన సమీకరణాల ప్రకారం...టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై దూకుడుగా స్పందించే ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి వరించడం ఖాయమని అంటున్నారు.
ఢిల్లీలోని బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం దాదాపు ఖారారు అయిపోయింది. దీనిపై అధికారికంగా కేంద్ర బీజేపీ నాయకత్వం ఓ ప్రకటన చేయనుంది. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఇప్పటికే అధిష్టానం లీకులు ఇచ్చింది. ముందుగా మాజీ మంత్రి మాణిక్యాలరావు కు ఆఫర్ ఇచ్చిన అధిష్టానం, మాణిక్యాలరావు ఆసక్తిగా లేకపోవడంతో సోము వీర్రాజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సోము వీర్రాజు మొదటి నుంచి టీడీపీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..టీడీపీ నాయకులపై దూకుడుగా ఉండటం, పార్టీలో అందరి నాయకులతో కలిసి పోవడం వంటి వాటితో సంతృప్తి చెందిన బీజేపీ అధిష్టానం ఆయనకు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కు కంభంపాటి హరిబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.
ఏపీ రాజకీయాలను గమనించిన వారి మాట ప్రకారం రాష్ట్ర బీజేపీ ముఖ్యనాయకుల్లో రెండుగా చీలిక ఉందని అంటున్నారు. టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన గ్రూపులు... అంతర్గత ఆదిపత్యపోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ టీడీపీ అనుకూల వర్గంగా చెప్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు - మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ - కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి వంటివారు వ్యతిరేక వర్గమని విశ్లేషిస్తున్నారు. ఈ నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీని టార్గెట్ చేసి.. విమర్శలు గుప్పించడంలో ముందుంటుండటం ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నారు. కాగా, ఏపీలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం ఈ క్రమంలో నెలాఖరుకల్లా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు సమాచారం.
టీడీపీ అధ్యక్షుడు, -ఏపీ సీఎం చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే వారిలో వీర్రాజు ముందువరసలో నిలుస్తారు. గతంలోనే వీర్రజాఉ పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ....ఆయన్ను అధ్యక్షుడుగా నియమిస్తే మిత్రపక్షమైన టీడీపీ ఎలా స్పందిస్తుందోనన్న సందేహం నెలకొంది. అయితే ఎన్డీఏకు టీడీపీ గుడ్ బై చెప్పేయడంతో పాటుగా ఇటీవల ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో అందుకు తగిన నాయకుడిని అధ్యక్షుడిని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీని వ్యతిరేకించడంతో పాటుగా దూకుడుగా స్పందించే వీర్రాజుకు అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.