పవన్ కళ్యాణ్ ను కలిసిన సోము వీర్రాజు

Update: 2020-08-07 12:10 GMT
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎంపికవ్వగానే వరుసగా నేతలను కలుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దల ఆశీస్సులు తీసుకున్న సోము వీర్రాజు.. నిన్న హైదరాబాద్ వచ్చి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవని కలిశారు. మర్యాదపూర్వకంగానే సోము వీర్రాజు మెగాస్టార్ ను కలిశారని ప్రకటన విడుదలైంది.

రాజకీయాలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను ఇద్దరూ చర్చించుకున్నారని.. చిరును బీజేపీలో చేర్పించడమే సోము వీర్రాజు ఎజెండా అని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఇక తాజాగా ఈరోజు పవన్ కళ్యాణ్ ను సోము వీర్రాజు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో బీజేపీతో కలిసి జనసేన పొత్తు పెట్టుకొని ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే జనసేన చీఫ్ ను సోము ఈరోజు కలిశారు.

ఇద్దరి మధ్య ఏపీ రాజకీయాల గురించి.. కలిసి ఎలా సాగడం.. మూడు రాజధానుల వ్యవహారం గురించి చర్చించినట్టు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం.
Tags:    

Similar News