ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం కొన్ని పథకాలపై సబ్సిడీ ఇస్తున్నా.. వాటిని వినియోగించుకోవడం లేదని, ఫలితంగా రాష్ట్రంలో సంక్షోభానికి కారణమవుతున్నారని అన్నారు. ముఖ్యంగే ఇక్కడ ఏర్పడిన విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణమన్నారు.
ఏపీ కోసం కేంద్రం ఎన్నో నిధులు ఇస్తోందని, వాటిని సక్రమంగా వినియోగించుకోకుండా ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నకల్లో వైసీపీపై మూకుమ్మడిగా పోరాటం చేస్తామని ఇటీవల ప్రకటించిన సోము వీర్రాజు తాజాగా విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శల దాడి ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీదేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడడానికి ప్రభుత్వ చేతకానితనమేనని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. రాష్ట్రం కంటే కేంద్రమే ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం అనేక మార్గాల ద్వారా నిధులను విడుదల చేస్తున్నా వాటిని సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేనిదన్నారు. డబ్బులు మాకిస్తే మేం పరిపాలన చేస్తామని స్పీకర్ అంటున్నారని.. మేం డబ్బుల ఇస్తామంటేనే గదా.. మీరు గెలిచిందని వీర్రాజు అన్నారు. కేంద్రం కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా వాటిని సరైన మార్గంలో వినియోగించుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని, స్పీకర్ ఆముదాలవలసకు రోడ్డు నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలపాలన్నారు.
కేంద్రం విడుదల చేస్తున్న పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని అన్నారు. విశాఖలోని 22(ఏ) భూములపై వైసీపీ నాయకుల కన్ను పడిందని, వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఉత్తరాంధ్ర ప్రజల వలసకు వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇక్కడ పంటల ప్రణాళిక దెబ్బతిందని అన్నారు. నీళ్ల కోసం ప్రాజెక్టుల నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. ఇదంతా బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇరిగేషన్ మంత్రి చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు.