త‌ల్లిని చంపి వండుకొని తిన్నాడు.. కోర్టు ఏం చెప్పిందో తెలుసా?

Update: 2021-07-11 14:32 GMT
క్ష‌ణికావేశంలో జ‌రిగే హ‌త్య‌లు ఉంటాయి.. ప‌గ‌తో చేసే హ‌త్య‌లు కూడా ఉంటాయి. కానీ.. ఇది ఎవ్వ‌రూ ఊహించ‌లేని సంఘ‌ట‌న‌. త‌ల్లితో జ‌రిగిన గొడ‌వ‌లో ఆమెను చంపేసి, ఆ త‌ర్వాత శ‌వాన్ని తిన్నాడో కొడుకు. అది కూడా ఫ్రై చేసుకొని తినేశాడు. ఈ దారుణ సంఘ‌ట‌న మ‌న దేశంలోనే 2017లో జ‌రిగింది. ఈ కేసు విచార‌ణ పూర్తి చేసిన న్యాయ‌స్థానం నిందితుడికి మ‌ర‌ణ శిక్ష విధించింది.

మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్ ప‌రిధిలోని సునీల్ రామ కుచ్కోర‌వి త‌న త‌ల్లితో గొడ‌వ ప‌డ్డాడు. దీంతో కోపం పెంచుకొని 2017 ఆగ‌స్టులో ఆమెను దారుణంగా హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత శ‌రీరాన్ని ముక్కలుగా న‌రికి ఆమె దేహంలో నుంచి గుండెను, ఇత‌ర అవ‌య‌వాల‌ను బ‌య‌ట‌కు తీశాడు. డెడ్ బాడీని అక్క‌డే ఉంచి, ఇందులో కొన్ని అవ‌య‌వాల‌ను పొయ్యిమీద పెనంలో వేసి వేయించి తిన్నాడు.

అయితే.. అదే స‌మ‌యంలో అక్క‌డి ఒక బాలుడు వ‌చ్చాడు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిపోయి ఉన్న మ‌హిళ‌ను చూసి గ‌ట్టిగా అరుస్తూ ప‌రుగులు పెట్టాడు. అది చూసిన స్థానికులు వ‌చ్చి చూశారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. హుటాహుటిన అక్క‌డ‌కు చేరుకున్నారు.

పోలీసులు అక్క‌డికి చేరుకునే స‌రికి.. అక్క‌డ‌ ఒక ప్లేటులో గుండె ఉంది. మిగిలిన అవ‌య‌వాలు పొయ్యి మీద పెనంలో క‌నిపించారు. దిగ్భ్రాంతికి గురైన పోలీసులు.. వెంట‌నే నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులోప్ర‌వేశ‌పెట్టారు. కేసు విచారించిన న్యాయ‌స్థానం.. తాజా తుదితీర్పు వెలువ‌రించింది. ఈ సంద‌ర్భంగా ఆవేద‌న, ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

'ఇది ఒక హ‌త్య మాత్ర‌మే కాదు. క‌రుడుగ‌ట్టిన క్రూర‌త్వం, మ‌ద్యానికి బానిసై తీవ్ర నేరానికి పాల్ప‌డ్డాడు. నిందితుడిలో క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. ఆమె అనుభ‌వించిన బాధ‌ను మాటల్లో చెప్ప‌లేం. నిందితుడిని మ‌ర‌ణించే వ‌ర‌కు ఉరి తీయాలి.'' అని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

ఇదే ఘటన.. స్పెయిన్ లోనూ జ‌రిగింది. అల్బెర్టో శాంచెజ్ గోమెజ్ అనే వ్య‌క్తికి త‌న త‌ల్లితో గొడ‌వ త‌లెత్తింది. ఆ త‌ర్వాత మాటా మాటా పెరిగి పెద్ద‌ది కావ‌డంతో.. త‌ల్లిని చంపేశాడు. ఆ త‌ర్వాత ఎవ్వ‌రూ చేయ‌లేని దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఆమె శ‌రీరాన్ని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికాడు. కొన్నింటిని ప్లాస్టిక్ క‌వ‌ర్ లో పెట్టి బ‌య‌ట ప‌డేశాడు. మ‌రికొన్ని ముక్కల‌ను మాత్రం ఫ్రిజ్ లో పెట్టాడు. ఆ త‌ర్వాత వాటిని 15 రోజుల‌పాటు కొంచెం కొంచెం తినేశాడు.
Tags:    

Similar News