ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరిలో రైతులను వాహనంతో తొక్కించి చంపిన కేసులో కేంద్రమంత్రి కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇటీవలే అతడు బెయిల్ పొందగా.. సుప్రీంకోర్టులో బాధితులు సవాల్ చేశారు. దీంతో అతడి బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు వెంటనే లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది.
ఈనేపథ్యంలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్ర సరెండర్ అయ్యాడు. జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం లొంగిపోయాడు. అనంతరం అధికారులు ఆశిష్ ను లఖింపూర్ ఖేరి జిల్లా జైలుకు తరలించారు. ఈకేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను ఈనెల 18న పరిశీలించిన సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాను ఆదేశించింది. ఈనేపథ్యంలోనే తుదిగడువుకుఒకరోజు ముందుగానే ఆశిష్ సరెండర్ అయ్యారు.
లఖీంపూర్ ఖేరీ కేసులో గతంలో నాలుగు నెలల పాటు ఆశిష్ మిశ్రా పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేయడాన్ని రైతులు వ్యతిరేకించారు. దీంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ను రద్దు చేయాలంటూ రైతులు వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ లో పెట్టింది. అలహాబాద్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్న వాదనను విన్న సుప్రీంకోర్టు.. విచారణ ఇంకా ప్రారంభం కానప్పటికీ నివేదికలు పరిశీలను చూడరాదని పేర్కొంది. సిట్ సూచించిన విధంగా హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేయకపోవడాన్ని ప్రత్యే బెంచ్ తీవ్రంగా పరిగణించింది.
గతంలో తీర్పు రిజర్వ్ సందర్భంగా సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ అంశంపై ఎక్కువ కాలం వేచి ఉండబోమని తెలిపారు. దీనిపై కోర్టు మేం చేయాలో మాకు తెలుసునని పేర్కొన్నారు. మరోవైపు బెయిల్ మంజూరులో హైకోర్టు వాస్తవాలను పట్టించుకోలేదని పిటీషనర్ జగ్జిత్ తరుఫున దుష్యంత్ దవే అన్నారు. ఇది తీవ్రమైన హత్య కేసుగా పేర్కొన్నారు. థార్ జీపుతో ప్రజలను హతమార్చారని ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా రాసి ఉందని దవే అన్నారు.
ఈ వాహనంలోనే కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కూర్చున్నారని.. ఈ సందర్భంగా బుల్లెట్లు కూడా పేల్చారని ఆయన వాదించారు.బెయిల్ మంజూరులో హైకోర్టు ప్రజలను ఉద్దేశపూర్వకంగా వాహనంతో దాడి చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదని దవే అన్నారు. ఆశిష్ మిశ్రా ప్రజలను కొట్టారని స్పష్టంగా చెప్పారని పిటీషనర్ తరుఫున న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు.
అయితే బెయిల్ మంజూరు చేస్తూ కాల్పులు జరిపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తెలిపింది. మంత్రి అజయ్ మిశ్రా బెదిరించారని.. డిప్యూటీ సీఎం రూటు మార్చినప్పటికీ నిందితులు మాత్రం రైతులు ఉన్న బాటలోనే పయనించారని వాదించారు. దీనిపై సిట్ సమగ్ర విచారణ జరిపిందని దవే తెలిపారు. వీడియో, ఆడియో సాక్ష్యాలు అందించారు. ఈ క్రమంలోనే అన్ని వాదనలు విన్న సుప్రీంకోర్టు నిందితులు ఆశిష్ మిశ్రా బెయిల్ ను కొనసాగించాలా? లేక అతడి బెయిల్ రద్దు చేయాలా? అన్న దానిపై తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వెలువరించింది. ఆశిష్ మిశ్రా బెయిల్ ను రద్దు చేసింది.దీంతో ఆశిష్ మిశ్రా తాజాగా కోర్టులో లొంగిపోయారు.
యూపీలోని 'లఖింపూర్ ఖేరి'లో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నిరసన చేస్తున్న రైతులు తమ దారిలో తాము ముందుకు సాగుతుంటే ఏమాత్రం కనికరం లేకుండా వాహనంతో గుద్దేసి ముందుకు వెళ్లిన నేతల వైనం షాకింగ్ గా మారింది. చుట్టూ వందల మంది ఉన్నా వాహనంతో ఢీకొడుతూ మనుషుల ప్రాణాలు తీసిన వైనం విస్తుగొలుపింది. అధికారబలంతో ఓ నేత చేసిన పని ఇదీ అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో తన కుమారుడు ఓ కేంద్ర సహాయ మంత్రి కప్పిపుచ్చే పని చేయడం విమర్శలకు తావిస్తోంది.తాజాగా అతడికి బెయిల్ పై సుప్రీం తీర్పు రిజర్వ్ చేసింది.