అమ్మ పెట్టే చిత్రహింసలపై కొడుకుకు ఎంతటి ఆవేదన?

Update: 2022-04-13 23:30 GMT
ఎక్కడైనా కసాయి పిల్లలుంటారు కానీ కసాయి తల్లి ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఓ విచిత్రమైన కేసు వచ్చింది. తన తల్లి అంటే తనకు ఇష్టం లేదని ఓ కుర్రాడు చెప్పడం విశేషం. తన చిన్నతనంలో తల్లి పెట్టే బాధలకు తన హృదయం ద్రవించిపోయిందని ప్రేమ అనే పదమే లేకుండా పోయిదని వాపోతున్నాడు. తల్లి పెట్టే చిత్రహింసలు భరించలేకే తల్లి అంటే మమకారం పోయిందని పేర్కొన్నాడు. అందుకే తండ్రి వద్ద ప్రశాంతంగా ఉంటున్న తనకు తల్లితో అవసరం లేదని తేల్చేశాడు. దీంతో ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదని చెబుతున్నాడు.

లోకంలో అమ్మ ప్రేమకంటే కమ్మనైనది ఏదీ ఉండదు. కానీ అమ్మ అంటేనే అతడికి కోపం వస్తుంది. తల్లి పేరు ఎత్తితేనే ఇంతెత్తు ఎగురుతున్నాడు. తనకు తల్లి లేదని చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. కన్న తల్లి అంటే తనకు ఇష్టం లేదని సమాధానం చెబుతున్నాడు. నా జీవితంలో ఆమెతో మాట్లాడను. ఆమె ముఖం కూడా చూడనని మొండికేస్తున్నాడు. చిన్నవాడిగా ఉన్నప్పుడు అమ్మ పెట్టిన చిత్ర హింసలు ఇప్పటికి గుర్తొస్తున్నాయని రోదించాడు.

చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే దారుణంగా కొట్టేదని విచారం వ్యక్తం చేశాడు. బూత్ రూంలో వేసి తాళం వేసేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. తనకు జరిగిన చిత్రహింసలు తలుచుకుంటే భయమేస్తోందని వణికిపోతున్నాడు. తనకు ఇప్పుడు 27 వచ్చినా గత కాలపు చిత్రహింసలు గుర్తుకు వస్తే బాధ కలుగుతుందని భయపడుతున్నాడు. అంతలా వేధించిన తన తల్లిపై తనకు ఎలాంటి ప్రేమ లేదన్నాడు.

సోమవారం జడ్జిలు చంద్రచూడ్, సూర్యకాంత్ ల ధర్మాసనం ఓ భార్యాభర్తల విడాకుల కేసు విచారణకు చేపట్టింది. 1988లో వివాహం చేసుకున్న ఓ జంట 2002 నుంచి విడాకులు కావాలని కోర్టు చుట్టు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో విచారణకు వచ్చిన కేసులో తల్లి తన కొడుకుతో మాట్లాడించాలని కోర్టును అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను విన్న కోర్టు కొడుకును కోర్టుకు రప్పించింది. ఆ కొడుకు మాత్రం తన తల్లితో మాట్లాడేది లేదని మొరాయిస్తున్నాడు. జడ్జీలు సముదాయించినా నేను మాట్లాడనని తెగేసి చెప్పడం గమనార్హం.

దీనిపై తల్లి తరఫు న్యాయవాది కొడుకును తండ్రి తన ఇష్టానుసరాంగా పెంచి తల్లిపై కర్కశత్వం నూరిపోశాడని వాదించారు. దీనికి తండ్రి తరఫు న్యాయవాది అతడికి మంచి చెడు తెలిసే వయసు ఉందని అమాయకుడేమీ కాదని తల్లి చేసిన చర్యలను చెబుతూ బాధపడటం చూస్తూనే ఉన్నాం కాదా అని ఎదురు దాడికి దిగారు. దీంతో కోర్టులో అందరు ఆశ్చర్యంగా చూశారు కన్న కొడుకే తల్లిని కాదని తండ్రితో ఉండటం చూస్తుంటే అందరిలో ఉత్కంఠ ఏర్పడింది.

చివరికైనా కొడుకు మనసు కలరగపోతుందా అని అంతా ఎదురు చూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొడుకు తన తల్లి చిత్రహింసలపై కన్నీరు కార్చడం చూస్తే అందరిలో తల్లిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి అంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా అని శాపనార్థాలు పెట్టారు. కన్న తండ్రిని అందరు ప్రశంసించారు. కొడుకును అంత బాగా చూసుకుంటున్న తండ్రికే అందరు జై కొట్టారు. మొత్తానికి తల్లే విలన్ గా మారడం విశేషం.

కన్నతల్లినే కాదనుకున్నాడంటే అతడు ఎంత మానసిక క్షోభకు గురయ్యాడో అర్థమవుతోంది. జీవితంలో తల్లి ముఖం చూడనని చెబుతుంటే అందరు నివ్వెరపోయారు. కుర్రాడిలో ఇంత వేదన ఉందా అని తమలో తామే ప్రశ్ణించుకున్నారు. మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అనే ప్రశ్న వస్తోంది. ఏదిఏమైనా తల్లిని చూస్తేనే రగిలిపోయే కొడుకుకు ఆమె ఎంత శిక్ష వేసిందో తెలుస్తూనే ఉంది. ఇలాంటి ఘటనలు చూస్తే అందరికి కంట నీరు ఉబికివస్తుంది.
Tags:    

Similar News