అమ్మకు అగ్రహం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం కానీ ఇచ్చేస్తే అధికారం తనదే అనుకున్నారే కానీ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొరకరాని కొయ్యగా మారతారని ఆమె అస్సలు ఊహించలేదు. దీనికి తోడు.. రాష్ట్రంలోని పరిస్థితులు.. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఇబ్బందికరంగా మారటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనే.. ఉస్మానియా విద్యార్థి జేఎసీ నేతలు వెళ్లి సోనియమ్మను కలిసి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులను వివరించి.. రాష్ట్ర సర్కారు ఆరాచకం సృష్టిస్తుందని.. కేవలం నలుగురి చేతిలోనే అధికారం మొత్తం పోగుపడిందని చెప్పటం.. అమ్మ పేరు మీద పాట రాసి.. వినిపించటంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
విద్యార్థులు వాడుకొని వదిలేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని వారు సోనియమ్మ ముందు ఏకరువు పెట్టటమే కాదు.. అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు సైతం కేసీఆర్ సుముఖంగా లేరంటూ వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సోనియమ్మ ఒకింత ఆగ్రహంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇందుకేనా? అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
ఉస్మానియా క్యాంపస్ కు రాహుల్ గాంధీ వస్తారని.. విద్యార్థులు ఉద్యమబాటలో నడవాలని.. వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. భట్టివిక్రమార్కలతో కూడిన బృందం యాభై మంది విద్యార్థులతో సోనియాగాంధీని కలిశారు. తాజా భేటీతో సీఎం కేసీఆర్ పై సోనియాగాంధీ మరింత అగ్రహంగా ఉన్నారని.. తెలంగాణ రాష్ట్రం మీద ఆమె మరింత దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. అమ్మ దృష్టి సారిస్తేనే.. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయేంత పరిస్థితి ఉందా..?