సోనియమ్మ చేతికి ఫ్యాక్చర్?

Update: 2016-08-04 10:01 GMT
రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ అడ్డాలో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని షురూ చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వారణాసి వెళ్లటం తెలిసిందే. తన రాజకీయ ప్రత్యర్థి ఇలాకాలో తన బలాన్ని ప్రదర్శించేందుకు భారీ రోడ్ షో ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి వారణాసికి చేరుకున్న ఆమె హుషారుగానే ఉన్నారు. రోడ్ షోలో పాల్గొన్న ఆమె ఉత్సాహంగా చేతులు ఊపటం.. పార్టీ నేతల్లో మరింత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం తెలిసిందే.

అలాంటి సోనియమ్మ ఉన్నట్లుండి అనారోగ్యానికి గురి కావటం ఏమిటి? ఆమెను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకురావటం.. అందుకోసం ప్రధానే స్వయంగా కలుగజేసుకోవటమే కాదు.. ఎయిర్ పోర్ట్ ని ఒకలాంటి అత్యవసర ఆసుపత్రిగా మార్చేసేంత ప్రమాదం ఏం జరిగిందన్న విషయంపై అటు కాంగ్రెస్ కానీ.. ఇటు ప్రభుత్వ వర్గాలుకానీ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

ఇక.. మీడియా కూడా ఈ అంశంపై లోతుల్లోకి వెళ్లినట్లుగా కనిపించలేదు. సోనియా అనారోగ్యం వెనుక అసలు కారణం ఏమిటి? ఆమె అనారోగ్యం ఎంత సీరియస్ అయినదన్న విషయంపై సరైన వార్లలు రాని లోటును ఒక ప్రముఖ మీడియా సంస్థ తీరుస్తూ ఒక కథనాన్ని అచ్చేసింది. దాని ప్రకారం.. సోనియాగాంధీ ముంజేతి ఎముక విరిగినట్లుగా సదరు కథనంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె చేతికి ఉన్నట్లుండి ఫ్యాక్చర్ ఎలా అయ్యిందన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వస్తోంది.

రోడ్ షోలో ఆమె చేతిని పదే పదే ఊపటం కారణంగా ఆమె మోచేయి ఎముక విరిగినట్లుగా వైద్యులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. గాయం తీవ్రత పెద్దదేనని.. దాదాపు వారం రోజుల వరకూ ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలులేవన్నట్లుగా చెబుతున్నారు. సోనియాకు వైద్యం చేస్తున్న వైద్యుల్లో డాక్టర్ అరూప్ బసు కీలమని చెబుతున్నారు. ఆయన నేతృత్వంలో పలువురు వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారని చెబుతున్నారు. రోడ్ షోలో చేయి ఊపితేనే ఎముక విరిగిపోయేంత బలహీనంగా సోనియమ్మ ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. సో.. సోనియమ్మ చాలా వీక్ గా ఉన్నారన్న మాట.
Tags:    

Similar News