సోనియమ్మ సిస్టర్ అలాంటి బిజినెస్ చేస్తారా?

Update: 2016-04-22 07:15 GMT
ఘాటైన విమర్శలకు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి కేరాప్ అడ్రస్. ఆయన నోటి నుంచి విమర్శలు.. ఆరోపణలు రాజకీయ ప్రత్యర్థులకు మంట పుట్టించేలా చేస్తాయి. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలపై ఇప్పటికే ఆయన చాలానే ఆరోపణలు చేశారు. సోనియా మీద ఆయన చేసిన ఆరోపణల్ని చాలామంది మర్చిపోలేరు. ఆమె విద్యార్హత.. రాహుల్ విద్యార్హతల మీద స్వామి ఇప్పటికే పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన సోనియాగాంధీ సిస్టర్ (చెల్లెలు) మీద ఘాటైన విమర్శలు చేశారు. ఇటలీలో ఉండే సోనియా సిస్టర్ అక్కడ బిజినెస్ చేస్తుంటారని.. ఇందుకోసం ఒక షాపును నిర్వహిస్తుంటారని చెప్పుకొచ్చారు. అయితే.. ఆ షాపులో అమ్మే వస్తువల మీద సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలు మంట పుట్టించేలా ఉన్నాయి. దేశంలో దొంగతనానికి గురైన పలు పురాతన వస్తువులతో సోనియా చెల్లెలు ఇటలీలో వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

అయితే..  ఈ వ్యాపారమంతా సోనియా కనుసన్నల్లో జరుగుతుందని స్వామి ఆరోపిస్తున్నారు. పురాతన విగ్రహాల వ్యాపారానికి సోనియా తన చెల్లెలు సహకారం తీసుకుంటున్నారని ఆయన విమర్శలు చేస్తున్నారు. ఈ ఉదంతంపై విచారణ జరపాలని స్వామి డిమాండ్ చేస్తున్నారు.

ఆయన ఆరోపణలకు తగ్గట్లే ఒక వీడియో సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఈ వీడియో విస్తృత వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ విషయంపై సోనియాగాంధీ స్పందించాల్సి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఒకవేళ అదే జరిగితే.. ఎక్కడో ఇటలీలో తన చెల్లికి ఉన్న షాపు.. అందులో  అమ్మే వస్తువులకు సంబంధించి సోనియా సమాధానం చెప్పాల్సి రావటానికి మించిన ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకేం ఉంటుంది..?
Tags:    

Similar News