కేంద్రాన్ని ధిక్కరించాలని రాష్ట్రాలకు సోనియా సూచన

Update: 2020-09-29 08:30 GMT
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించుకున్న వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, ప్రతిపక్షాలు, రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో అయితే బంద్ కూడా విజయవంతం అయ్యింది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేయకుండా ఉండేందుకు ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించాలని సూచించింది.

ఇదే సమయంలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు అమలు చేయకుండా కొత్తగా రాష్ట్రాలే చట్టాలు చేయాలని.. ఈ మేరకు అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచన చేయాలని సోనియాగాంధీ కీలక సూచనలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిరంకుశ వ్యవసాయ చట్టాలను అధిగమించే చర్యలు, ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని.. రైతులను రక్షించే చట్టాలను ఆయా ప్రభుత్వాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి సెంటర్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తిరస్కరించడానికి కొత్త చట్టాలను తేవాలని రాష్ట్రాలకు సోనియా సూచన చేశారు.
Tags:    

Similar News