మందుబాబులకు స్వీట్ న్యూస్..బీర్..విస్కీ ఇంటికే డెలివరీ

Update: 2020-02-07 11:06 GMT
రానున్న రోజుల్లో మందుబాబులకు పండుగే పండుగ అని చెబుతున్నారు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండానే.. ఎంచక్కా ఆన్ లైన్ లో బుక్ చేయటం ద్వారా ఇంటికే నేరుగా బీర్.. విస్కీలను తెప్పించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లుగా చెబుతున్నారు. త్వరలో నచ్చిన ఆల్కహాల్ బ్రాండ్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలన్న ఆలోచనలో ఈ కామర్స్ విభాగం ఉన్నట్లుగా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

రాష్ట్రాలు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలంటే ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు షురూ చేస్తే మస్తు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లిక్కర్ ను ఆన్ లైన్లో అమ్మే వీలున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు పొరుగున ఉన్న కర్ణాటకలో ఇప్పటికే ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడి అమ్మకాల జోరు పెరిగిందని.. ఇదే బాటలో మిగిలిన రాష్ట్రాలు నడవాలని చెబుతున్నారు. ఈ రిటైలింగ్ వల్ల అన్ని రంగాల్లో అమ్మకాలు పెరుగుతున్నాయని.. మద్యం అమ్మకాలు మరింత పెరిగే వీలుందని చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ నుంచి వచ్చే ఆదాయాన్ని మినహాయిస్తే.. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలకు ఓకే చెప్పే దిశగా ఆయా రాష్ట్రాలు ఓకే అనే వీలుందని చెబుతున్నారు. అదే జరిగితే.. మందుబాబులకు కావాల్సిందేముంది?
Tags:    

Similar News