పెళ్లితో ఒక్క‌టైన ప్ర‌ముఖ మ‌హిళా క్రికెట‌ర్లు!

Update: 2018-07-09 04:35 GMT
జ‌ట్టులో స‌భ్యులుగా ఉన్న ఇద్ద‌రు మ‌హిళా క్రికెట‌ర్లు పెళ్లి బంధంతో ఒక్క‌టి కావ‌టం సంచ‌ల‌న‌మే.తాజాగా అలాంటి ఉదంత‌మే ద‌క్షిణాఫ్రియా మ‌హిళా క్రికెట్ జ‌ట్టులో చోటు చేసుకుంది. ఇద్ద‌రు మ‌హిళ‌లు పెళ్లితో ఒక్క‌ట‌య్యే దానిపై ద‌క్షిణాఫ్రికాలో ఎలాంటి ఇబ్బందులు లేవు. తాజాగా సౌతాఫ్రికా మ‌హిళా జ‌ట్టులోని ఇద్ద‌రు అగ్ర‌శ్రేణి క్రికెట‌ర్లు పెళ్లితో ఒక్క‌టైన విశేషం చోటు చేసుకుంది.

జ‌ట్టు కెప్టెన్ డేన్ వాన్ నిక్కెర్క్‌.. పేస్ బౌలర్ క‌మ్ ఆల్ రౌండ‌ర్ మ‌రిజాన్ కాప్ లు ఇద్ద‌రు తాజాగా పెళ్లి చేసుకున్నారు. 2009 వ‌రల్డ్ క‌ప్ టోర్నీలో భాగంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ జ‌ట్టులోకి అడుగుపెట్టిన ఇద్ద‌రు చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించి అత్యుత్త‌మ ఆట‌గాళ్లుగా పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు.

ఇద్ద‌రు అంత‌ర్జాతీయ మ‌హిళా క్రికెట‌ర్లు పెళ్లి చేసుకోవ‌టం ఇది రెండోసారిగా చెబుతున్నారు. గ‌త ఏడాది న్యూజిలాండ్‌ కు చెందిన అమీను స‌హ‌చ‌రి లియా పెళ్లాడింది. తాజాగా మ‌రోసారి ఇలాంటి ప‌రిణామ‌మే చోటు చేసుకుంద‌ని చెప్పాలి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం కెరీర్ లో పీక్స్ లో ఉన్నారు. వీరిద్ద‌రూ ఇప్పుడు ఐసీసీ టాప్ 10  స్థానంలో ఉన్నారు.

2017-18 సంవ‌త్స‌రానికి ద‌క్షిణాఫ్రికా అత్యుత్త‌మ క్రికెట్ అవార్డును అందుకున్న నికెర్క్.. ఆ దేశం త‌ర‌ఫున వ‌న్డేలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా కొన‌సాగుతున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ద‌క్షిణాఫ్రియాలోని బాలుర అకాడ‌మీలో శిక్ష‌ణ పొందిన తొలి ఇద్ద‌రు అమ్మాయిలుగా రికార్డు ఉన్న వీరు.. త‌మ పెళ్లి వార్త‌తో అంత‌ర్జాతీయంగా అంద‌రి దృష్టిలో ప‌డిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News