కర్ణాటక ఎన్నికల్లో సౌతాఫ్రికా ఈవీఎంలా? ఈసీ క్లారిటీ

Update: 2023-05-12 19:42 GMT
కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 10న పోలింగ్ ముగిసింది. రేపు ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎం మోసాలు అంటూ రాజకీయ పార్టీలు ఆరోపనలు గుప్పిస్తున్నాయి. కర్ణాటకలో జరిగిన ఎన్నికలకు  సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ఈవీఎంలు ఉపయోగించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపనలు చేశారు. అయితే ఈ విషయంలో భారత ఎన్నికల అధికారి కార్యాలయం పక్కా క్లారిటీ ఇచ్చింది.

కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 10న ఒకే విడతలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. గత ఎన్నికల కంటే రెండు శాతం ఎక్కువగా 73 శాతం ఓట్లు కర్ణాటక పోలింగ్ లో నమోదయ్యాయి.

ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల కోసం దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఈవీఎంలను ఉపయోగించారని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ రణదీప్ సింగ్ చేసిన ఫిర్యాదు పై భారత ఎన్నికల అధికారి కార్యాలయం క్లారిటీ ఇచ్చింది.

కర్ణాటకలో పోలింగ్ ముగించుకొని ఎగ్జిట్ పోల్ లో హాంగ్ సంకేతాలు వెలువడుతున్నాయి. జెడి(ఎస్) తో దోస్తీ కోసం అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా ఈవీఎంలపై భారత ఎన్నికల కమిషన్ నుండి క్లారిటీ వచ్చింది. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు దక్షిణ ఆఫ్రికా ఈవీఎంలను వాడారని రణదీప్ సింగ్ ఎన్నికల అధికారులకు ఈనెల 8న లేఖ రాశారు. దీనిపై తనకు సమాధానం ఇవ్వాలని కోరారు.
 
ఈ విషయమై భారత ఎన్నికల కమిషన్ వివరణ ఇస్తూ తాము దక్షిణాఫ్రికా నుంచి ఈవీఎంలను తీసుకురాలేదని, వాటిని ఎన్నికల్లో ఉపయోగించలేదని తెలిపింది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తయారుచేసిన ఈవీఎంలను మాత్రమే కర్ణాటక ఎన్నికల్లో వాడామని చెప్పింది.

ఈ మిషన్లకు కౌంటింగ్ తో పాటు రీకౌంటింగ్, పునః పరిశీలన వంటి సౌకర్యాలు ఉన్నాయని తెలిపింది. ఎలక్షన్లలో దక్షిణాఫ్రికా నుండి తెచ్చిన ఈవీఎంలను  ఉపయోగించారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించింది.

Similar News