తాము సంపాదించిన డబ్బునే తమ ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకోలేక ఇండియాలో ప్రజలు ఏటీఎంల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి.. ప్రజల చేతిలో పట్టుమని పది కరెన్సీ నోట్లు కూడా ఉండడం లేదు. కానీ, దక్షిణాఫ్రికాలో మాత్రం ఓ వ్యక్తి ఒళ్లంతా నోట్లతోనే కనిపిస్తున్నాడు. కరెన్సీ నోట్లనే దుస్తులుగా మార్చుకున్నాడు. చాలాకాలంగా ఆయనది అదే స్టైలట. తాను వేసుకునే దుస్తులు కనిపించకుండా మొత్తం కరెన్సీ నోట్లను పిన్ చేసుకుని తిరిగే ఆయన ఒక ఆయుర్వేద వైద్యుడు. ఈ తరహా కరెన్సీ డ్రెస్ కారణంగా ఆయనకు ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది.
డర్బన్‌కి చెందిన ఈ కరెన్సీ కాస్ట్యూమ్స్ బాయ్ పేరు ఆండలి డిలామిని. ఆయుర్వేద వైద్యం చేసే ఆయన ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తారని పేరు. దీంతో రెండు చేతులా సంపాదించాడు. మరి.. ఎందుకొచ్చిందో కానీ, ఇలా నోట్లను అలంకరించుకోవాలని ఆయనకు ఓ ఫైన్ మార్నింగ్ ఆలోచన వచ్చిందట. అప్పటి నుంచి ఇదే తీరు.
అయితే... ఒళ్లంతా నోట్లను అతికించుకుని తిరిగితే ఏమైనా ఉందా.. ఈడ్చిపెట్టి నాలుగు తన్ని ఒంటి మీద ఉన్న డబ్బును వలుచుపోతారు దొంగలు. అందుకే.. ముందుజాగ్రత్తగా బాడీగార్డులను కూడా నియమించుకున్నాడు. ఇంతకాలం ఇది బాగానే నడిచింది... ఆ ప్రత్యేక కరెన్సీ వస్త్రధారణ కారణంగా విపరీతంగా పాపులర్ అయ్యడాయన. కానీ.. రీసెంటు ఓ ఆర్టిస్టు మరణిస్తే, అంత్యక్రియలకు వెళ్లినప్పుడూ ఇలాగే వెళ్లడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/