హైదరాబాద్ లో అతిచిన్న పాప జననం..

Update: 2018-07-19 11:21 GMT
సాధారణంగా డెలివరీ కాగానే   పుట్టిన సంతానం ఎంత బరువుంది.? ఆరోగ్యంగా ఉందా అని చూస్తాం.. దాదాపు 2 కిలోల నుంచి 5 కిలోల లోపు బరువు ఉండే పిల్లలు పుడతారు. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది. కేవలం 375 గ్రాముల బరువున్న పాప పుట్టింది. ఆ పాప పొడువు కూడా కేవలం 20 సెంటీమీటర్లు మాత్రమే.. పాప పాదాలు కేవలం గోరంత పరిమాణంలో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో బిడ్డ జీవించే అవకాశాలు 0.5శాతం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆ బిడ్డ బతికింది.

హైదరాబాద్ రెయిన్ బో ఆస్పత్రిలో వైద్యులు చరిత్ర సృష్టించారు. నాలుగు నెలలు ముందుగా 25 వారాలకే పుట్టిన పాపను బతికించారు. చెర్రీ అని పేరు పెట్టుకున్న ఆ పాప బరువు చూసి అందరూ షాక్ అవుతున్నారు. పాప శరీరావయవాలు ఇంకా పూర్తిగా ఏర్పడనందువల్ల జీవక్రియలు సరిగా పనిచేయక ఇలాంటి శిశువులు తీవ్ర ఇబ్బందులు పడతారట.. సాధారణంగా కాన్పులోనే కన్నుమూస్తారట.. కానీ రెయిన్ బో వైద్యులు  పాపను బతికించి అద్భుతం చేశారు.

ఈ విషయాన్ని వారి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది. చెర్రి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పాపను జాగ్రత్తగా ఈ లోకంలోకి తెచ్చిన వైద్యులకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
Tags:    

Similar News