పెళ్లి ... జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక. కానీ, కరోనా కారణంగా పెళ్లిళ్లు చిత్ర , విచిత్రాలుగా జరుగుతున్నాయి. గతంలో పెళ్లిళ్లు జరగాలంటే బంధువులు, తల్లిదండ్రుల అంగీకారంతో జరిగేవి. ఇప్పుడు కరోనాకాలం కాబట్టి , వారి అనుమతులకు తోడు పోలీసులు అనుమతులు కూడా కావాల్సి వస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే ... ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ జిల్లా ఎస్పీ మణికాంత్ మిశ్రా ఓ ప్రాంతంలో జరిగే పెళ్లిలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఆయన్ని చూసిన పెళ్లికూతురు, పెళ్లికొడుకు, పురోహితుడు, అతిథులు అందరూ షాక్ అయ్యారు.
పెళ్లి మండపంలో ఎందుకు వచ్చాడో తెలియక పూజారి, పెళ్లిపెద్దలు, వధూవరులు బిక్కచచ్చిపోయారు. అప్పటివరకు ఆనందోత్సాహాల తో కళకళలాడిన పెళ్లివేదిక పోలీసు అధికారి రాకతో సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోయింది. అలా పెళ్లికి వచ్చిన బాగేశ్వర్ జిల్లా ఎస్పీ మణికాంత్ మిశ్రా నేరుగా పెళ్లి మండపం వద్దకొచ్చి పురోహితుడు పక్కనే కూర్చున్నారు. దీంతో పురోహితుడికి పంచె తడిచిపోవటం ఒక్కటే తరువాయి. అలా నోరెళ్లబెట్టి చూస్తుండిపోయాడు. దీంతో అలా చూస్తున్న అతడిని చూస్తున్న పురోహితుడ్ని పంతులు గారూ బాగున్నారా, అంటు పలకరించారు. దానికి ఆయన అయోమయంగానే తలఊపాడు. ఆ తరువాత ఎస్పీ మణికాంత్ మిశ్రా తను వచ్చిన పని ప్రారంభించారు. వధూవరుల్ని పలకరించారు. అనంతరం వధూవరులతో కరోనా మంత్రాలు చదివారు. ఎస్పీ చెప్పినట్లే వధూవరులిద్దరూ కరోనా జాగ్రత్తల్ని చదివారు.
అనంతరం ఎస్పీ పెళ్లివారితో మాట్లాడుతూ..ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కూడా తన డ్యూటీలో భాగంగానే భావిస్తున్నానని,అందుకే ఎక్కువమంది హాజరయ్యే పెళ్లి వేడుకకు వచ్చి కరోనా నియమాలు అందరూ పాటించేలా చూస్తున్నానని తెలిపారాయన. ఇకపై పూజారులు కూడా విధిగా పెళ్లిమంత్రాలతో పాటు కరోనా సూత్రాలు కూడా పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో చెప్పించాలని సూచించారు. ఆ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారు. కాగా..జిల్లా ఎస్పీగా తాను శాంతిభద్రతలే కాదు, కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేయడం కూడా తన బాధ్యతేనని బలంగా నమ్ముతున్నారు.