దేశంలో ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. పెట్టుబడులు పెట్టడం.. ఏడాదిలో రెట్టింపు ఇచ్చేస్తాం అనే తరహా ఆశచూపి.. ప్రజలనుంచి డిపాజిట్లు ఇబ్బడి ముబ్బడిగా వసూలుచేసి.. బోర్డు తిప్పేసే బాపతు గాళ్లు చాలా ఎక్కువైపోయారు. ప్రతిచోటా ఇబ్బడిముబ్బడిగా ఆర్థిక నేరాలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అక్రమాలనుంచి ప్రజలను కాపాడడానికి ప్రతి రాష్ట్రంలోనూ ఒక ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ ఆర్థికస్థాయీ సంఘం సిఫారసు చేస్తున్నది. ఒక రకంగా గమనించినప్పుడు.. ఇలాంటి సిఫారసు చేయవలసిన ఖర్మ పట్టడం అనేది మన జాతి సిగ్గుపడాల్సిన విషయం!
ఎందుకంటే.. ఒక రకమైన నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని అనిపించినప్పుడు వారిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటిని నియంత్రించడానికి అలాంటి నేరాలు జరక్కుండా, ప్రజలు చిక్కుల్లో పడకుండా ఉండడానికి ఏం చేయగలమో ఆలోచించాలి. అలాంటి పరిస్థితిని పక్కన పెట్టి... నేరం జరిగిపోయిన తర్వాత.. విచారించి శిక్షలు వేయడానికి న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలంటూ సిఫారసు చేయడం ఏమిటో మరీ చోద్యంగా ఉంది.
అధిక వడ్డీలు ఆశచూపి సామాన్యుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ప్రెవేటు సంస్థలు తరచూ మోసాలు చేస్తున్నాయి. అంటే ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. చిట్‌ఫండ్‌ల దగ్గరినుంచి మూకుమ్మడి పెట్టుబడి పథకాల సంస్థలన్నీ మోసపూరితం అని తేలుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వీటిని కట్టడి చేయడానికి కఠినమైన చట్టాలు తేవడం అవసరం. అంతే తప్ప.. నేరాలు జరిగిపోయిన తర్వాత విచారించడానికి కోర్టులు స్పెషల్ గా ఏర్పాటుచేద్దాం అనుకోవడం భావదారిద్య్రం. ఎయిడ్స్ లాంటి వాటి గురించి అన్నేసి కోట్ల రూపాయలు ప్రచారానికి ఖర్చుచేసే ప్రభుత్వాలు, ప్రజల జీవితాలను ఛిద్రం చేసే ఇలాంటి మోసపూరిత సంస్థల గరించి కూడా అవగహన ప్రచారాలు నిర్వహించాలి. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్ప... కోర్టులు ఏర్పాటుచేస్తే కాదు.. అని వారు గ్రహించాలి.