అందరూ వదిలేసిన వేళ.. చంద్రుడిని శోధించే కార్యక్రమానికి తెర తీసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలి ప్రయత్నంలో సక్సెస్ కావటం.. రెండోసారి మాత్రం చివర్లో విఫలం కావటం తెలిసిందే. తొలి చంద్రయాన్ గుర్తించిన అంశాలు ప్రపంచం మొత్తం చంద్రుడి మీద మళ్లీ ఆసక్తి పెరిగిన సంగతి తెలిసిందే. మరో ఐదు రోజుల్లో ఏపీలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 3ను ప్రయోగించేందుకు రంగం సిద్ధమవుతోంది. అన్ని ఏర్పాట్లు పూర్తైన వేళ.. ఈసారి ఏమవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
2008లో చంద్రయాన్ పేరుతో తొలి ప్రయోగంలో చంద్రకక్ష్యలోకి సులువుగా శాటిలైట్ ను ప్రవేశ పెట్టటం తెలిసిందే. 2019లో చంద్రుడి మీదకు రోవర్ ను దించేందుకు ప్రయత్నించి.. చివర్లో ఫెయిల్ కావటం భారతీయుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ పట్టువిడవకుండా.. చంద్రయాన్ తో ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటాలని తపిస్తోంది భారత్. అందుకు తగ్గట్లే నాలుగేళ్ల తర్వాత మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. గతంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈసారి పక్కాగా విజయాన్ని సాధించాలన్న తపనతో చేస్తున్న ఈ ప్రయోగం ఈ నెల 14న నింగిలోకి ఎగిసేందుకు సిద్ధమవుతోంది.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. చంద్రుడ్ని చేరుకున్న నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటివరకు రష్యా.. అమెరికా.. చైనాలు మాత్రమే చంద్రుడ్ని చేరుకున్నాయి. భూమికి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే చంద్రుడిని చేరేందుకు మూడు అంచెల్లో ప్రయాణం సాగనుంది. ఈ జర్నీకి తగ్గట్లు.. ఎల్వీఎం3-ఎం4 అనే బారీ రాకెట్ ను ప్రయోగిస్తున్నారు. దీని బరువు 3.9 టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీలు. అంటే.. 3900 కేజీలు). చంద్రయాన్ 2లో ప్రయోగించిన రాకెట్ బరువు 3600 కేజీలు.
రాకెట్ ను ప్రయోగించినంతనే తొలుత ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి చేరుస్తుంది. భూమి చుట్టూ ఇది 24 రోజుల పాటు తిరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడి దిశగా ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. చంద్రకక్ష్యలోకి చేరటానికి ఐదు రోజుల సమయం పడుతుంది. చంద్రుడి చుట్టూ 19 రోజులు తిరుగుతూ.. ఆ ప్రక్రియలో చందబాబుకు మరింత చేరువగా చేరుకుంటుంది.
ఉపగ్రహం నుంచి ల్యాండర్ విడిపోయి సౌత్ లో ల్యాండ్ అవుతుంది. చంద్రయాన్ 2 ఫెయిల్ అయ్యింది ఇక్కడే. ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొనటంతో రోవర్ ఆశించినంతగా పరిశోధనలు చేయలేదు. గంటకు 6058 కి.మీ. వేగంతో ల్యాండర్ కిందకు జారుతుంది. సెకన్ కు 2 మైళ్ల వేగంతో ల్యాండర్ హెలికాఫ్టర్ లా చంద్రుడిపై వాలుతుంది. అనంతరం రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై తిరుగుతూ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. చంద్రయాన్ 1లో చంద్రుడి మీద జలవనరుల జాడను గుర్తించటం తెలిసిందే.
ఆ ప్రాంతంలో పరిశోధనలు చేయటానికి వీలుగా రోవర్ ను అక్కడ దించనున్నారు.చంద్రుడిపై ఉన్న ఖనిజ వనరులు.. నీరు.. ఇంధన నిల్వల్ని గుర్తించి అవి మనకు ఏ మేరకు ఉపయోగపడతాయన్నది అంచనాకు తాజా ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగం కోసం రూ.615 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 14 మధ్యాహ్నం 2.35 గంటల వేళలో శ్రీహరి కోట నుంచి ఈ రాకెట్ ప్రయోగం ఉండనుంది.