అనాథ టీడీపీకి భార్య‌, భ‌ర్త‌లే గ‌తా ?

Update: 2021-06-16 03:30 GMT
ఏపీలో టీడీపీ ఎంత దీన‌స్థితిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఉన్న నాయ‌కులే సింపుల్‌గా కండువాలు మార్చేస్తున్నారు. అస‌లు పార్టీలో ఎప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు ఉంటారో ?  కూడా తెలియ‌డం లేదు. మొన్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భంజ‌నం , తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం త‌ర్వాత చాలా మంది వైసీపీ లేదా బీజేపీ లోకి వెళ్లి పోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతం గా ఉండ‌డం తో వీరి చేరిక‌లు వాయిదా ప‌డ్డాయి. అస‌లు ఏడెనిమిది మంది ఎమ్మెల్యేల‌ను కూడా టీడీపీ వాళ్లే న‌మ్మే ప‌రిస్థితి లేదు. వారు ఎప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఉంటారో కూడా పార్టీ నేత‌ల‌కే తెలియ‌డం లేదు.

ఇక ఏపీలో ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 30 కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ఇన్‌చార్జ్‌ లు, స‌రైన నాయ‌కులు లేరు. ఈ క్ర‌మంలోనే శ్రీకాకుళం జిల్లా కేంద్రం లో కూడా టీడీపీ ఇదే దుస్థితి లో ఉంది. ఇక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎన్నో సేవ‌లు చేస్తోన్న మాజీ మంత్రి గుండ అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ‌ తో పాటు ఆయ‌న భార్య మాజీ ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవి దంప‌తులే ఇప్ప‌ట‌కీ పార్టీని సాకాల్సి వ‌స్తోంది. వీరు ఇప్ప‌టికే వ‌యొః భారంతో ఉన్నారు. 2014 లో అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ పోటీ నుంచి త‌ప్పుకుని త‌న భార్యను రంగం లోకి దింపారు. ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన ఆమె గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వీరు పార్టీని న‌డిపించ‌లేక‌పోతున్నారు. ఇక త్వ‌ర‌లోనే శ్రీకాకుళం కార్పొరేష‌న్‌ కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లోనూ టీడీపీని న‌డిపించే బాధ్య‌త‌ల‌ను మ‌ళ్లీ గుండ దంప‌తుల మీదే పెట్టేసింద‌ట పార్టీ అధిష్టానం. ఇక్క‌డ మేయ‌ర్ ప‌ద‌వి బీసీ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ అయ్యింది. దీంతో ల‌క్ష్మీదేవి ని పార్టీ త‌ర‌పున ముందుగానే మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పి... మ‌ళ్లీ ఇక్క‌డ పార్టీ ప‌గ్గాలు ఈ వృద్ధ దంప‌తుల మీదే పెట్టేయాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నార‌ట‌. ప‌ట్ట‌ణంలో టీడీపీ, వైసీపీకి స‌మాన‌మైన బ‌లం ఉంది.

ధ‌ర్మాన ఇక్క‌డ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని... పార్టీ గెలిచిన‌ప్ప‌టి నుంచి ముభావంగా ఉంటున్నారు. పైగా త్వ‌ర‌లో జ‌రిగే మార్పుల్లో అయినా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఆయ‌న ఉన్నారు. మ‌రి ధ‌ర్మాన లాంటి స్ట్రాంగ్ లీడ‌ర్‌ను ఈ వృద్ధ దంప‌తులు ఎలా ఎదుర్కొంటారో ?  చంద్ర‌బాబు వీళ్ల‌తోనే ఇక్క‌డ పార్టీని ఎంత వ‌ర‌కు న‌డిపిస్తారో ?  చూడాలి.
Tags:    

Similar News