కరోనా తీవ్రత.. దాని విపరిణామాలకు సంబంధించి దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రుల కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఎక్కువ అవగాహన ఉందని చెప్పాలి. ఈ కారణంతోనే.. ఆయన మిగిలిన రాష్ట్రాల కంటే.. ఆ మాటకు వస్తే కేంద్రం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి ముందే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశారు. ఇలా కరోనా మీదా.. దాని కారణంగా చోటు చేసుకునే పరిణామాలపై సంపూర్ణ అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలో భారీగా ఉంది.
అలాంటి కేసీఆర్.. కరోనాను డీల్ చేయటం.. సుదీర్ఘకాలం పాటు సాగే ఈ పోరులో మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. పాలనా పరమైన అంశాల్లో ఎలా వ్యవహరించాలి? షెడ్యూల్ ప్రకారం సాగే అంశాల విషయంలో ఏమేం చేస్తే బాగుంటుంది? లాంటి విషయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ వెనుకబడినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణల్ని కూడా చూపిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో అన్ని వ్యవస్థలకు షాకింగ్ గా మారాయి. అందులోని కొన్ని మరింతగా ప్రభావితమయ్యాయి. కరోనా నేపథ్యంలో.. స్కూళ్లు..కాలేజీ మూసి ఉండటమే కాదు.. ఆన్ లైన్ క్లాసుల్ని కొందరు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు.. కాలేజీలు నిర్వహించే అవకాశం ఉందా? ఒకవేళ.. ఓపెన్ చేసినా.. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువుకునేందుకు పంపుతారా? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే ఏపీలో స్కూళ్లు ఓపెన్ చేసే విషయానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. అదే రీతిలో చాలా ప్రాక్టికల్ గా ఎదురయ్యే సమస్యల విషయంలోనూ వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీ పరీక్షల విషయంలోనూ జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంసెట్.. మిగిలిన ప్రవేశ పరీక్షల్ని నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ చూస్తే.. ఏపీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటంలో ముఖ్యమంత్రి జగన్ స్పీడ్ ముఖ్యకారణంగా చెప్పాలి. మరి.. తెలంగాణలో అలాంటి పరిస్థితి ఎందకు కనిపించట్లేదు? కొన్ని నిర్ణయాల విషయంలో జగన్ ప్రదర్శిస్తున్న వేగం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఎందుకు ఉండట్లేదన్న ప్రశ్న పలు సందర్భాల్లో వినిపిస్తోంది.