అత్యంత ప్రముఖులకు భద్రత బాధ్యతలు నిర్వహించే వారు చాలా కీలకం. వీరి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. దేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీకి వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా ఉన్న కమాండో ఒకరు మిస్ కావటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమెండో రాకేశ్ కుమార్ సోనియాగాంధీ నివాసమైన టెన్ జన్ పథ్ దగ్గర విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే.. అతను ఈ నెల 3 నుంచి కనిపించకుండా పోయిన విషయం ఇప్పుడు భద్రతా వర్గాలకు కలవరపాటుకు గురి చేస్తోంది. సెప్టెంబరు 3 నుంచి రాకేశ్ కుమార్ కనిపించకుండా పోవటంతో అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఢిల్లీ పోలీసులకు ఆయన జాడ కనిపించటం లేదని చెబుతున్నారు.
31 ఏళ్ల కమెండో రాకేశ్ కుమార్ ద్వారకా సెక్టార్ 8లో తన ఫ్యామిలీతో నివసిస్తున్నాడు. రాకేశ్ కనిపించటం లేదన్న విషయాన్ని అతని తండ్రి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. సోనియా కమెండో కనిపించటం లేదన్న విషయం బయటకు పొక్కింది. సెప్టెంబరు 1న యూనిఫామ్ లో విధినిర్వహణకు వచ్చిన రాకేశ్.. 11 గంటలకు తన సర్వీస్ రివాల్వర్.. సెల్ ఫోన్ వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో.. అతని జాడను తెలుసుకోవటం కష్టమవుతుందని చెబుతున్నారు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని.. అతనికి ఎవరితోనూ శత్రుత్వం లేదన్న విషయాన్ని చెబుతున్నారు. మరి.. అన్ని బాగున్నప్పుడు రాకేశ్ కుమార్ ఎక్కడికి వెళ్లినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం లభించటం లేదు.