దివాలాకు నో చెప్పిన స్పైస్ జెట్.. త్వరలో బాగా ఎగురుతుందట

Update: 2023-05-12 10:01 GMT
ఇటీవల దివాళ ప్రక్రియలోకి వెళ్లిన గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ మాదిరే మరో చౌక ధరల విమాన సంస్థ స్పైస్ జెట్ కూడా దివాలా బాట పట్టనుందా? అన్న చర్చ ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా స్పైస్ జెట్ ఈ చర్చకు పుల్ స్టాప్ పెడుతూ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తమకు దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకునే ఆలోచనలు ఏమీ లేవని పేర్కొంది. సాంకేతిక కారణాలతో ఎగరకుండా ఉండిపోయిన పాతిక విమానాల్ని త్వరలో ఎగిరించే యోచనలో ఉన్నట్లు తెలిపింది.

కార్యకలాపాలు నిలిపివేసిన పాతిక విమానాల్ని తిరిగి పునరుద్ధరించేందుకు వీలుగా 410 కోట్ల డాలర్లను వెచ్చించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. స్పైస్ జెట్ కు విమానాలు ఇచ్చిన ఒక లీజు దారు.. సదరుసంస్థ దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసుకునే వేళ.. సంస్థ స్పష్టమైన ప్రకటనను చేసింది.  వేరే విమానయాన సంస్థ చేసుకున్న దరఖాస్తు కారణంగా తమ మీద ఏర్పడిన ఊహాగానాలకు తెర దించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే స్పైస్ జెట్ కు విమానాలు ఇచ్చిన ఐర్లాండ్ కు చెందిన లీజ్ సంస్థ ఎయిర్ కాజిల్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ వినతిపై సంస్థ నోటీసులు జారీ చేసింది. దీనిపై వచ్చే వారం విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే.. తమకు దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకునే ఆలోచనలు ఏమీ లేవని స్పష్టం చేయటం ద్వారా.. స్పైస్ జెట్ ఇతర అంశాల మీద ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.

Similar News