ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి (69) మృతి చెందారు. ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన ఎస్పీవై రెడ్డి... తదనంతరం చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి సొంతంగానే పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టిన రెడ్డి... అంచెలంచెలుగా ఎదిగారు. తన సొంతూరు నంద్యాల కేంద్రంగా నంది పైపులు పేరిట పంట పొలాలకు నీటి పారుదల కోసం వినియోగించే పైపుల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చారు. అనతి కాలంలో నంది గ్రూప్ ను పలు రంగాలకు విస్తరించిన ఎస్పీవై రెడ్డి... ఎస్పీవై రెడ్డి విద్యా సంస్థల పేరిట విద్యాలయాలను కూడా నెలకొల్పారు. ప్రత్యేకించి బాలికల విద్యకు ప్రాధాన్యమిచ్చిన రెడ్డి... మహిళా కాలేజీలను కూడా ఏర్పాటు చేశారు.
నంద్యాల పరిధిలోని రైతులకు ఎన్నో లాభాలు చేకూర్చే నిర్ణయం తీసుకుని వారికి అండగా నిలిచి పైపుల రెడ్డిగా తనదైన ముద్ర సంపాదించుకున్నారు. పారిశ్రామిక రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన ఎస్పీవై రెడ్డి... ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆదిలో నంద్యాల ఎంపీగా బీజేపీ టికెట్ పై పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగానూ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినా... ఆయనకు విజయం వరించలేదు. ఇలా కాదనుకున్న రెడ్డి... 2000 ఏడాదిలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నంద్యాల మునిసిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసిన ఆయన రికార్డు మెజారిటీతో గెలిచారు. అదే ఊపులో 2004 ఎన్నికల్లో మరోమారు నంద్యాల ఎంపీ బరిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి విక్టరీ సాధించారు. 2009లోనూ అదే కాంగ్రెస్ తరఫుననే పోటీ చేసి గెలిచారు.
2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నంద్యాల నుంచే బరిలోకి దిగి వరుసగా మూడో సారి కూడా ఎంపీగా గెలిచారు. అయితే ఎన్నికల్లో గెలిచి ఎంపీగా ప్రమాణం చేయకముందే ఆయన టీడీపీలో చేరిపోయారు. 2019 దాకా టీడీపీకి దగ్గరగానే సాగిన ఎస్పీవై... సరిగ్గా ఎన్నికలకు ముందు తనకు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో టీడీపీకి దూరంగా జరిగిన ఎస్పీవై రెడ్డి... జనసేనలో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో జనసేన తరఫున నంద్యాల ఎంపీగా బరిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి... ఇద్దరు కూతుళ్లు, పెద్దల్లుడిని కూడా జనసేన తరఫున అసెంబ్లీ బరిలో నిలిపారు. చాలా కాలం నుంచి అనారోగ్యంతో వీల్ చైర్‌కే పరిమితమైన ఎస్పీవై రెడ్డి... అనారోగ్యం ముదరడంతో ఈ నెల 3 నుంచి కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే ఆయన నేటి రాత్రి తుది శ్వాస విడిచారు.