చంద్రబాబు ను అండమాన్‌ జైలుకు పంపించాలనుకున్న ఎన్టీఆర్ ...!

Update: 2020-02-25 11:00 GMT
ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ ,వైసీపీ నేత లక్ష్మీ పార్వతి , టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తన భర్త ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు పై ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో , ఆ వ్యాఖ్యలని మరోసారి ఆమె గుర్తు చేసుకున్నారు. ‘మాజీ సీఎం ఎన్టీఆర్‌ చనిపోయిన రోజుల్లో చంద్రబాబు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసేవారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే.. చంద్రబాబు ను తప్పకుండా అండమాన్‌ జైలుకు పంపించాలని ఉందని తనతో అన్నట్లు లక్ష్మీ పార్వతి గుర్తు చేసుకున్నారు.

అయితే , అది అయన బ్రతికి ఉండగా కుదరలేదు కానీ , చంద్రబాబుకు ఆ రోజు అతి త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఏపీలో టీడీపీ గత పాలనపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అన్ని వాస్తవాలు బయటకొస్తాయని ఆశిస్తున్నానని, చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి.. ఈ ముగ్గురూ జైలుకు వెళ్లడం చూస్తానని చెప్పారు.

అంతేకాకుండా, ప్రాచీన తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొస్తామని లక్ష్మీపార్వతి చెప్పారు. తెలుగు సాహిత్య పీఠాన్ని విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు లక్ష్మీపార్వతి. తెలుగుతో పాటు ఇంగ్లీషుకు కూడా సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు ను కచ్చితంగా బోధించాలని ప్రైవేటు విద్యా సంస్థలకు ఆదేశాలిచినట్లు చెప్పారు. తెలుగు భాష అమ్మే.. కానీ.. అప్పుడప్పుడు కొన్ని మెళుకువలు పాటించాలని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News