ఏపీ కేడర్ కు శ్రీలక్ష్మి.. గ్రీన్ సిగ్నల్ రాలేదా?

Update: 2020-12-14 07:39 GMT
ఏపీలో జగన్ గెలవగానే ఆ రాష్ట్రంలో పనిచేయడానికి చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లు ఆసక్తి చూపారు. ఏపీకి వెళ్లడానికి కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా జగన్ తో సాన్నిహిత్యం కారణంగా పంపడానికి రెడీ అయినా కేంద్రం మాత్రం నో చెప్పింది. జగన్ కోసం మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా డిప్యూటేషన్ పై ఏపీకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ లు జగన్ వద్ద పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక జగన్ తోపాటు కేసుల్లో ఇరుక్కున్న వారు వాటి నుంచి బయటపడడానికి ఏపీనే బెటర్ అని ఆలోచిస్తున్నారు.

ఈ క్రమంలోనే జగన్ తోపాటు కేసుల్లో ఉన్న సీనియర్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ శ్రీలక్ష్మీ ఏపీ కేడర్ కు మారాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. క్యాడర్ మార్పునకు క్యాట్ అంగీకరించకపోవడంతో ఇది కార్యరూపం దాల్చలేదు. శ్రీలక్ష్మీ భవిష్యత్తు ఇప్పటికీ కేంద్రం చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఏపీ ఐఏఎస్ వర్గాల్లో ఇదే చర్చకు దారితీసింది.

శ్రీలక్ష్మీని రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది కేంద్రం. జగన్ సీఎం అయ్యాక శ్రీలక్ష్మీ ఏపీకి డిప్యూటేషన్ పై రావడానికి ప్రయత్నించారని తెలిసింది. సీఎం పేషీలో కీలక పాత్ర పోషిస్తారని భావించారు. ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ తో, కేంద్రంతో చర్చించారని తెలిసింది. కానీ కేంద్రం నుంచి సానుకూలత రాక పెండింగ్ లో పడిపోయింది.  

ఈ క్రమంలోనే క్యాట్ కు శ్రీలక్ష్మీ వెళ్లగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమెను రిలీవ్ చేసింది. శ్రీలక్ష్మీ కూడా ఏపీకి వచ్చి జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.

క్యాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కేంద్రంలోని డీఓపీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీని వెనుక ఎవరున్నారన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఏకంగా ఏపీ కేడర్ లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 10 నుంచి ఆమెను ఏపీ కేడర్ లోకి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. డీఓపీటీ నిర్ణయం తర్వాత ఆదేశాలు మారవచ్చని ఏపీ సర్కార్ ట్విస్ట్ ఇచ్చింది.

ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ సర్కార్ డీఓపీటీకి లేఖ రాసినా అక్కడి నుంచి స్పందన రాలేదని సమాచారం. దీంతో శ్రీలక్ష్మీ ఎక్కడ పోస్టింగ్ దక్కుతుంది? వెనక్కి తెలంగాణకు వెళుతుందా అనేది ఆసక్తిగా మారింది. అసలు ఆమెను ఆపుతున్నది ఎవరనేది అంతుచిక్కడం లేదట.. ఇప్పుడు ఈ విషయం సచివాలయ వర్గాల్లో కోడైకూస్తున్నారు.
Tags:    

Similar News