తప్పును తప్పుగా చెప్పాలి. ఒప్పును ఒప్పుగా చెప్పాలి. తప్పును కొందరి సంతోషంగా ఒప్పుగా చెప్పటం.. దాన్ని ప్రశ్నించేటోళ్లను కన్వీన్స్ చేసేందుకు పిడి వాదనను తెర మీదకు తీసుకురావటం లాంటి చేష్టలు కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నాయి. ఇదే.. దేశంలోని మెజార్టీ హిందువులకు ఒళ్లు మండేలా చేస్తోంది. దీన్ని అసరాగా చేసుకొని.. హిందువులను పిచ్చి పిచ్చి అంశాలతో పొల్యూట్ చేసే సరికొత్త ఎత్తుగడ మొదలైందా? అంటే.. కర్ణాటకలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అవునన్న మాట వినిపిస్తోంది.
హిందు కావొచ్చు.. ముస్లిం కావొచ్చు.. మతం కంటే మానవత్వం చాలా అవసరం. ఎవరెన్ని చెప్పినా.. ఈ దేశంలోని 135 కోట్ల మంది భారతీయులే. వారి మతం వేర్వేరుగా ఉండొచ్చు. కొన్ని.. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఒక విషయంలో ఒకరు తగ్గితే.. మరో విషయంలో ఇంకొకరు తగ్గితే ఇష్యూనే లేదు.
ప్రతి విషయం మాదే పైచేయి అన్నట్లుగా ఉండకూడదు. అలా అని ప్రతి ఇష్యూలోనూ ఎదుటివాళ్లను తొక్కేయాలని అస్సలు అనుకోకూడదు. గడిచిన నాలుగైదేళ్లుగా చూస్తే.. దేశంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు.. కర్ణాటకలో ఈ మధ్యన హిజాబ్ ఇష్యూనే వచ్చింది.
ఆ విషయంలో ముస్లింలు చేసే వాదన పిడివాదనని.. హిందూ సంఘాలు చెప్పే వాదనలో న్యాయం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. దాన్ని అసరా చేసుకొని.. గడిచిన కొద్ది రోజుల్లో రెండు అంశాల మీద కర్ణాటకలో కొత్త చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. శ్రీరామ సేన సంస్థ. ఇప్పుడా సంస్థ రెండు అంశాల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. అందులో ఒకటి.. హలాల్ మాంసం కొనొద్దని.. తాజాగా ముస్లిం వ్యాపారస్తుల వద్ద మామిడిపండ్లు కొనొద్దని. ముస్లిం పండ్ల వ్యాపారుల్నిబహిష్కరించాలన్న పిలుపును ఇవ్వటం కొత్తవివాదం రాజుకుంది.
ఇక్కడ ఒక విషయాన్ని క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. హిజాబ్ విషయంలో.. ముస్లిం వర్గాలు తమ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అదెలా అంటే.. పదేళ్ల క్రితంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో హిజాబ్ ధరించటం ఎక్కువ చేస్తున్నారని.. గతంలో మాదిరి ఎందుకు ఉండరన్న ప్రశ్నను సంధిస్తున్నారు. ఎవరికి వారు తమ మతాన్ని ప్రతిబింబించే చర్యల్ని వీలైనంత వరకు తగ్గించాల్సిన అవసరం ఉంది.
అదే సమయంలో హలాల్ మాంసం కొనొద్దని.. ముస్లిం వ్యాపారుల వద్ద మామిడి పండ్లను కొనుగోలు చేయొద్దని చెప్పే వారి తీరును ఖండించాల్సిందే. ఎందుకంటే.. అమ్మే వ్యాపారి మతం ఏమిటన్న దాన్ని చూసి వస్తువుల్ని కొనటం దుర్మార్గమే అవుతుంది. వస్తువును ఎవరు నాణ్యతతో.. చౌకతో.. వాల్యూ ఫర్ మనీ అన్నది చూడాలే కానీ.. అందుకు భిన్నంగా ఆలోచిస్తే.. సమాజంలో ఉండే సమతూకంలో తేడా వస్తుంది. అది ఎవరికి మంచిది కాదన్నది మర్చిపోకూడదు.
మామిడి పంట్ల హోల్ సేల్ మార్కెట్ లో ముస్లిం వ్యాపారులదే అధిపత్యమని.. హిందూ రైతుల దగ్గర పళ్లను వెంటనే కొనకుండా వెయిట్ చేయించి.. తర్వాత తమ సరకును కొనేయాలన్న డిమాండ్ బాగా పెరిగిన తర్వాత.. తక్కువ ధరకు కొనేసే అలవాటుఉందన్న ఆరోపణ చేస్తుంటారు. ఆ మాటకు వస్తే మామిడి మాత్రమే కాదు.. వడ్లు.. ఇతర పంటల్ని కూడాహోల్ సేల్ వ్యాపారులు ఇదే రీతిలో అమ్ముతారన్నది మర్చిపోకూడదు.
అందుకే.. మామిడి పండ్లను కొనుగోలు చేయొద్దన్న పిలుపును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ.. ఎవరైనా దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తే.. ముందు అతడి తీరును ఖండించటంతో పాటు.. సమాజంలో ఇతర మతాల వారితో ఉండే సోదరభావాన్ని దెబ్బ తీసే ఇలాంటి ప్రచారాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఒకటి తర్వాత ఒకటిగా ఏదో ఒక వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తున్నశ్రీరామ సేన తీరును తప్పు పట్టటంతో పాటు.. ఆ సంస్థ ప్రతినిధులు తమ పరిమితులు దాటకూడదన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇదంతా చెబుతున్నారంటే మీరేమైనా తేడా కేసు అనుకోవద్దు. ఎందుకంటే.. ముందే చెప్పినట్లు నిజాన్ని నిజంగా చెప్పటం.. నిజాన్ని అబద్ధంగా చెప్పటం ఇష్టం లేదు. ప్రజలకు మంచి జరిగేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పేరుతో లేని మత మౌఢ్యాన్ని మనసుల్లో నింపేసుకోవటం దేశ సమగ్రతకు ప్రమాదమన్నది మర్చిపోకూడదు.
ఇటీవల కాలంలో శ్రీరామ సేన చేస్తున్న ప్రచారాన్ని చూస్తే.. బ్రాండ్ కర్ణాటకను దారుణమైన డ్యామేజ్ చేయాలన్నదే లక్ష్యమన్నట్లుగా ఉంది. అందుకే.. వారి పిచ్చి చేష్టల్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వారు ఏదైనా మంచి అంశాన్ని ప్రస్తావిస్తే.. వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో.. తప్పుడు మాటలతో రెచ్చగొట్టే వారి మాటలకు ఉత్తినే రెచ్చిపోకుండా వారు ప్రస్తావించే అంశాల్లోని ‘విషయాన్ని’ చెక్ చేసుకొని మద్దతు ఇవ్వటం చాలా అవసరం.