భారతీయ రుచులకు ఫిదా అయిన 'స్టార్బక్స్' సీఈవో.. ఏమన్నారంటే?

Update: 2022-11-05 23:30 GMT
ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ వ్యాపారానికి కేరాఫ్ గా స్టార్ బక్స్ నిలుస్తోంది. ఈ స్టార్బక్స్ గురించి ఈ రోజుల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. కళాశాలలో చదువుకునే యువతీ యువకులు.. కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది మధ్యలో కాస్తా రిలాక్స్ కావడానికి బెస్ట్ స్పాట్ గా స్టార్బక్స్ కాఫీ సెంటర్లు ఎన్నో ఏళ్లుగా నిలుస్తూ వస్తున్నాయి.

1971 మార్చి 30న అమెరికాలోని వాషింగ్టన్ లో జెర్రీ బాల్డ్విన్.. జెవ్ సీగల్.. గోర్డాన్ బౌకర్ లు ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం సీటెల్, వాషింగ్టన్లో ఉంది. దాదాపు 51 ఏళ్ల చరిత్ర స్టార్ బక్స్ కాఫీ హౌస్ లకు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో 33వేల 833 సోర్స్ ను స్టార్ బక్స్ కలిగి ఉంది. వీటిలో 15వేల 444 స్టోర్లు యూఎస్ఏలోనే ఉన్నాయి. మిగిలిన ఇతర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద కాఫీ హౌస్ కేంద్రాలను స్టార్ బక్స్ కలిగి ఉంది.  ఈ క్రమంలోనే ఇండియాలోనూ స్టార్ బక్స్ కాఫీ సెంటర్లు విరివిగా వెలిశాయి. బ్రిటీష్ కాలం నుంచి భారతీయులు టీ.. కాఫీలను ఆస్వాదించడం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో రకరకాల కాఫీ అనుభవాలను భారతీయులకు స్టార్ బక్స్ పరిచయం చేసి ఇక్కడి వారికి దగ్గరైంది.

హోల్-బీన్ కాఫీ.. మైక్రో-గ్రౌండ్ ఇన్‌స్టంట్ కాఫీ.. ఎస్ప్రెస్సో.. కేఫ్ లాట్..  ఫుల్ అండ్ లూస్ లీఫ్ టీలు.. జ్యూస్‌లు.. ఫ్రాప్పూచినో పానీయాలు.. పేస్ట్రీలు.. స్నాక్స్‌లను స్టార్ బక్స్ అందిస్తోంది. వీటిలో కొన్ని ఆఫర్లు సీజన్ వారీగా.. ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ కాఫీ సెంటర్లలో ఉచిత వైఫ్ ఇంటర్నెట్ సేవలు కూడా గమనార్హం.  

ఇదిలా ఉంటే తాజాగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్-2022 బెంగళూరు వేదికగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ బక్స్ సీఈవో జెవ్ సీగల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీగల్ బెంగుళూరులోని ప్రాచీన రెస్టారెంట్ ను సందర్శించారు. ఇక్కడి రుచులకు ఆయన ఫిదా అయ్యారు.  ఈ రెస్టారెంట్లో మసాలా దోశ.. ఫిల్టర్ కాఫీ చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన కితాబిచ్చారు.

భారతీయ రుచులు తనకు ఎంతో మధురానుభూతిని పంచాయని సీగల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హోటల్ సిబ్బందిని అభినందించారు. ఏది ఏమైనా ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ వ్యాపారానికి సీఈవో ఉన్న జెల్ సీగల్ కు మన దేశ కాఫీ రుచిని కితాబు ఇవ్వడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతటి వారైనా మన రుచులకు ఫిదా కావాల్సిందేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News