ఫేస్ బుక్ పై మ‌రో బాంబు పేలింది

Update: 2018-03-23 10:33 GMT
ఇప్ప‌టికే వ్య‌క్తిగ‌త డేటా చౌర్యంపై తీవ్ర విమ‌ర్శ‌లు.. న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్న ఫేస్ బుక్ కు మ‌రో క‌ష్టం ఎదురైంది. ఫేస్ బుక్ స‌మాచార గోప్య‌త విష‌యంలో మ‌రో బాంబును పేల్చారు వైట్ హౌస్ మాజీ అధికారి స్టీవ్ బ‌న్నోన్‌. వ్య‌క్తిగ‌త ఖాతాదారుల స‌మాచారాన్ని ఫేస్ బుక్ అమ్మ‌కానికి పెడుతుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న ఒక స‌ద‌స్సులో చెప్పి కొత్త బాంబ్ ను పేల్చారు.

ఫైనాన్షియ‌ల్ టైమ్స్ ప‌త్రిక నిర్వ‌హించిన స‌ద‌స్సులో పాల్గొన్న ఆయ‌న ప‌లు సంచ‌ల‌న అంశాల్ని వెల్ల‌డించారు.  త‌న ఖాతాదారుల గోప్య‌త‌కు సంబంధించిన డేటాను అమ్మేసుకోవ‌టంలో ఫేస్ బుక్ గురించి సందేహ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అది నిజ‌మేన‌న్నారు. అది ఏ ఒక్క దేశానికో ప‌రిమితం కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రిగిన‌ట్లుగా చెప్పారు. ఈ కార‌ణంతోనే ఫేస్ బుక్ వ్యాపారం..మార్కెట్లో దాని షేర్ల విలువ ఇంత స్థాయిలో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

వ్య‌క్తిగ‌త డేటాను ఫేస్ బుక్ అమ్ముతుంద‌న్న ఆయ‌న‌.. రాజ‌కీయ సంబంధిత డేటా చోరీ అంశంపై మాత్రం త‌నకు స్ప‌ష్ట‌త లేద‌న్నారు. త‌న‌కు తెలీని విష‌యంపై తాను మాట్లాడ‌లేన‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ట్రంప్ మాజీ కార్య‌ద‌ర్శి.. కేంబ్రిడ్జ్ అన‌లైటికా మాజీ ఉపాధ్య‌క్షుడు బ‌న్నోన్ గ‌తంలో మాట్లాడుతూ ఫైర్ అండ్ ఫ్యూరీ ఇన్ సైడ్ ద ట్రంప్ వైట్ హౌజ్ పుస్త‌కం ద్వారా అధ్య‌క్ష భ‌వ‌న స‌మాచారాన్ని బ‌హిర్గ‌త పర్చ‌టంతో పాటు అవినీతి..  అస‌మ‌ర్థ పాల‌న ఉందంటూ ట్రంప్ పై విమ‌ర్శ‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News