విశాఖ‌లో ఏం జ‌రుగుతోంది... వైసీపీ వ్యూహ‌మేంటి...?

Update: 2023-02-16 17:00 GMT
ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌ను `విశాఖ‌ప‌ట్నం` కుదిపేస్తోంది. విశాఖ ఒక్క‌టే రాజ‌ధాని అని.. ఇత‌ర మూడు ప్రాంతాలు కావ‌ని.. మూడు రాజ‌ధానులు అంటూ.. కొంద‌రు మిస్ క‌మ్యూనికేట్ చేశార‌ని.. వైసీపీ నాయ‌కుడు.. మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం రేపింది. దీంతో అస‌లు ఏపీకి రాజ‌ధాని మాటేంట ని.. ప్ర‌తిప‌క్షాలు నిప్పులు చెరిగాయి. మూడు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని కూడా అన్నారు.

దీంతో బుగ్గ‌న వ్యాఖ్య‌ల‌కు విరుగుడుగారంగంలోకి దిగిన స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్నారెడ్డి మూడు రాజ ధానులు ఉన్నాయ‌ని.. అయితే.. విశాఖ‌ను మాత్రం పాల‌నా రాజ‌ధానిగా చేస్తున్నామ‌ని.. చెప్పుకొచ్చారు. ఇక‌, దీనిపైనా విమ‌ర్శ‌లువ‌స్తున్నాయి.

పైగా..వ‌చ్చే నెల‌లో పెట్టుబ‌డుల స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నారు. ఫ‌లితం గా.. విశాఖ‌పై వైసీపీ ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టింద‌నే వాద‌న వినిపిస్తోంది. కానీ, ఇంత‌లోనే ఇక్క‌డ భూముల కోస‌మే వైసీపీ నేత‌లురాజ‌ధానిగా ప్ర‌క‌టించారనే పాత వాద‌నే కొత్త‌గా తెర‌మీదికి వ‌చ్చింది.

ఇదిలావుంటే.. పెట్టుబ‌డుల‌ను తీసుకు వ‌చ్చేందుకు మంత్రులు బుగ్గ‌న‌, గుడివాడ అమ‌ర్నాథ్‌లు విశేషంగా నే కృషి చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ముంచుకు వ‌స్తుండ‌డంతో పాటు.. ప్ర‌తిప‌క్షాల దూకుడు ను నిలువ‌రించేందుకు వారు త‌మ‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కానీ, విశాఖ‌కు మూడు న్న‌రేళ్ల‌లో ఏం చేశార‌నే మ‌రో ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. ఇది కూడా వాస్త‌వ‌మే., విశాఖ‌లో వైసీపీ ప్ర‌భుత్వం చేసింది ఏమీ క‌నిపించ‌డం లేదు. దీంతో విశాఖ‌పై వైసీపీ ప్రేమ ఉత్తుత్తిదేన‌నే ప్ర‌చారం మొద‌లైంది.

అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం ఈ విమ‌ర్శ‌ల‌ను విస్మ‌రిస్తోంది. ఎక్క‌డా రియాక్ట్ కాకుండా.. త‌న దారిలో తాను ముందుకు సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర ఓట్ల‌ను ద‌క్కించుకునేందుకు విశాఖ‌ను మించిన మార్గం లేద‌ని వైసీపీ భావిస్తోంది. సీమ‌లో ఎలానూ త‌మ పార్టీకి ఎదురు లేద‌ని భావిస్తున్న వైసీపీ మిగిలిన మూడు ప్రాంతాల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. ఈ వ్యూహంతోనే ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. ముందుకే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం

Similar News