రాష్ట్ర శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్ కు శాసనమండలిలో మాత్రం ఆ బలం లేదు. మండలిలో టీడీపీదే ఆధిపత్యం. అందుకే ఏపీకి మూడు రాజధానులు సహా పలు కీలక బిల్లును టీడీపీ అడ్డుకుంది.అయితే ఇప్పుడు ఏపీ మండలిలో ఆరు సీట్లు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యేల కోటాలో ఇవి భర్తీ చేస్తున్నారు. జగన్ ఆల్ రెడీ ఆరుగురిని ప్రకటించారు. అయితే సీనియర్లు లేకపోవడంతో వారంతా జగన్ పై అలక వహించారు.మండలిలో వైసీపీ సీట్లు పెరిగినా.. సీనియర్ల అసంతృప్తితో రగడ నెలకొంది. సీఎం జగన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో పదవి ఇస్తామని చెప్పడంతో సద్దుమణిగినట్లు సమాచారం.
ఈసారి మండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటు కోసం వైసీపీ నుంచి బోలెడు మంది ఆశలు పెంచుకున్నారు. గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి సీటు ఖాయం అనుకున్నారు. జగన్ కూడా వీరికి హామీనిచ్చారు. కానీ గుంటూరు నుంచి జంగా కృష్ణమూర్తికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో వారంతా షాక్ అయ్యారు. టీడీపీ నుంచి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కు కూడా జగన్ ఎమ్మెల్సీ ఇవ్వడంతో అలకవహించారు.
ఇక పశ్చిమ గోదావరిలో షేక్ ముజబుల్ రెహమాన్, తోట త్రిమూర్తులు, కుడిపూడి చిట్టబ్బాయ్ లకు జగన్ హామీ ఇచ్చారు. కానీ సామాజిక సమీకరణాలతో వీరికి వీలు పడలేదు.మండలిలో ప్రస్తుతం 58 సీట్లు ఉన్నాయి. టీడీపీకి 26 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి 8మంది ఉన్నారు. నామినేటెడ్ 8మంది, పీడీఎఫ్ 5, బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఆరుగురితో వైసీపీ బలం 14కి పెరగనుంది.