ఎలర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరికి కొన్ని పండ్లు..కొన్ని ఆహారపదార్థాలు అస్సలు పడవు. వీటికే చాలామంది హైరానా పడిపోతుంటారు. వేదన చెందుతారు. తమదెంత బ్యాడ్ లక్ అనుకొని ఫీల్ అవుతారు. ఇలాంటి వారే కాదు.. నిక్షేపంగా ఉండి కూడా తరచూ వేదన చెందే వారంతా ఈ అమ్మాయి గురించి తెలిస్తే షాక్ తినటమే కాదు.. తామెంత లక్కీ అని ఫీల్ కావటం ఖాయం.
తరచూ తమ జీవితం మీద వేదన చెందేవారంతా ఈ అమ్మాయి స్టోరీ తెలిస్తే మాత్రం.. తమకు మించిన లక్కీ ఇంకెవరూ ఉండరనుకుంటారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమెకున్న సమస్య ఏమిటన్న విషయాల్లోకి వెళితే..
ఆమె పేరు తెస్సా హాన్సెన్ స్మిత్. వయసు 21 ఏళ్లు. చూసినంతనే వావ్ అనేంత అందంగా ఉంటుంది. ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా ఉంటుంది. కాస్త బొద్దుగా ఉన్నా.. సున్నితంగా ఉండే ముద్దుగుమ్మది ఒక సాడ్ స్టోరీ. అది కూడా అలాంటిది ఇలాంటిది కాదు. ఆమెకు ఆక్వాజెనిక్ ఆర్టికేరియా అనే అలర్జీతో బాధ పడుతున్నారు. అలర్జీ పేరు ఎంత చిత్రంగా ఉంటుందో.. దాని వివరాలు తెలిసే కొద్దీ వామ్మో అని గుండెలు అదిరిపోవటం ఖాయం.
ప్రపంచంలో కేవలం వంద మందికి మాత్రమే ఈ తరహా అలర్జీ ఉందని చెబుతారు. వీళ్లు నీళ్లు తాగలేరు. స్నానం చేయలేరు. వర్షంలో తడవకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. నీళ్లు అనే పదార్థమే వీరి జోలికి రాకూడదు. అంతదాకా ఎందుకు? కాస్త ఆడుకున్నంతనే ఒంటికి చెమట పట్టిందా? వీరికి నరకం మొదలవుతుంది. ఎక్కడ చెమట పడితే అక్కడ కందిపోవటమే కాదు.. మంటలు పుడతాయి. కాస్త దాహంగా ఉందని నీళ్లు తాగితే.. నోరు మొత్తం మండిపోవటమే.
ఆమె శరీరం మీద నీళ్లు పడితే చాలు యాసిడ్ పడినట్లుగా చర్మం మీద బొబ్బలు ఏర్పడతాయి. ఒళ్లంతా దద్దుర్లతో ఎర్రగా మారిపోతుంది. ఇక.. స్విమ్మింగ్ ఫూల్.. నదిలోనో.. సముద్రంలోనో స్నానం చేస్తే ప్రాణమే పోతుంది. అందుకే ఆమె అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది. కాలేజీ క్యాంపస్ లో కూడా తిరగదు. కారులోనే ప్రయాణిస్తుంది. ఎందుకంటే.. చెమట పడితే ఆమెకు నరకమే.
ఈ అలర్జీ కారణంగా నెలకు రెండుసార్లు మాత్రమే స్నానం చేసే సాహసం చేస్తుంది. అది కూడా చాలా భయంగా. ప్రత్యేక ఏర్పాట్లతో స్నానం ముగిస్తుంది. తన గురించి ఆమెను అడిగితే ఆమెకున్న సమస్యలుప్రపంచంలో మరెవరికీ ఉండవేమో అనిపించక మానదు. కనీసం కన్నీళ్లు కూడా కార్చకూడని పరిస్థితి తనదని ఆమె వాపోతుంది. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారం.. పండ్లు.. ఇంకేం తిన్నా ఆమె నాలుక మీద పుండ్లు వచ్చేస్తాయి.
ఆమె పుట్టిన తర్వాత ఈ అలర్జీతో ఉన్న విషయాన్ని ఎనిమిదేళ్ల వయసులో గుర్తించారు. అప్పటివరకూ ఏదేదో సమస్య అనుకున్నారు కానీ.. ఆమెకున్న అసలు సమస్య ఏమిటో ఎనిమిదో ఏట గుర్తించారు. అప్పటికే ఆమె ఎన్నో అవస్థలకు గురైనట్లు చెప్పింది. ఆమె తల్లిదండ్రులు వైద్యులు కావటంతో తమ కుమార్తె కాస్త తేడా వ్యవహారమన్న విషయాన్ని గుర్తించి.. పరీక్షలు చేయించటంతోఅసలు విషయం బయటపడింది. ఇక.. తన సమస్యను కాస్త తగ్గించుకోవటానికి రోజు ఎనిమిది మందు బిళ్లలు వాడుతోంది. అయినా.. ఆమె సమస్య మాత్రం కాస్త కూడా తగ్గలేదట. ఇప్పుడు చెప్పండి.. మీకున్న సమస్యలు.. మీరు పడుతున్న బాధలు..?