మైక్రోన్.. ఆధునిక సామాజిక పోకడలతో కొత్తగా వచ్చిన రోగమిది. దీన్నే తెలుగులో పార్శ్వపు తలనొప్పి అంటారు. ఇది చాలా వరకు తలలోని ఒక పక్కకు వస్తుంది. స్త్రీలలో అధికంగా వస్తుంది. పురుషులను వేధిస్తుంది. వాంతులు వస్తాయి. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఈ రకం తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్టుగా.. వస్తూ పోతున్నట్టుగా.. తగ్గుతూ తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. ఈ తలనొప్పిని శాశ్వతంగా తగ్గించే మందేదీ ఇప్పటికీ లేదు. కాకపోతే దీన్ని నియంత్రించేందుకు మందులున్నాయి.
ఇప్పుడు పని ఒత్తిడి - కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేయడాలు - నిద్ర - విశ్రాంతి లేని పనుల వల్ల ఈ మైగ్రేన్ తరుచుగా వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా కాఫీ అధికంగా తాగడం వల్ల ఈ మైగ్రేన్ తలనొప్పి అధికమవుతుందని ఇజ్రాయిల్ దేశానికి చెందిన ‘బెత్ ఇజ్రాయిల్ డీకోన్స్ మెడికల్ సెంటర్’ శాస్త్రవేత్తలు ఓ పరిశోధనలో తేల్చారు.
మనం పొద్దున లేవగానే కాఫీతోనే రోజును మొదలు పెడుతాం. ఇక ఆఫీసులోకి వెళ్లాక మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా కాఫీలు తాగేస్తూనే ఉంటాం. మోతాదుకు మించి కాఫీ తాగితే అది ఆరోగ్యానికే ముప్పు అని ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు తేల్చారు.
రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే మైగ్రేన్ ముప్పు తప్పదు అని శాస్త్రవేత్తల బృందం నిగ్గుతేల్చింది. రోజుకు రెండు కప్పులు తాగినప్పుడు ఏ ఇబ్బంది రాలేదని.. మూడో కప్పు తాగితే మాత్రం విపరతీమైన తలనొప్పి వస్తున్నట్టు శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. సో కాఫీ ప్రియులు ఇప్పటికైనా జర కంట్రోల్ గా కాఫీ తాగితే బెటర్. లేదంటే మీకు మైగ్రేన్ ముప్పు పొంచి ఉన్నట్టే..