డొనాల్డ్ ట్రంప్ ప్రచార బాధ్యతల్లో తెలుగువారు!

Update: 2016-07-22 09:35 GMT
తనదైన నోటి దురుసుతో అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలతో ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వచ్చే నవంబర్ లో జరిగే ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరుపున వర్జీనియా ప్రాంతంలో ప్రచార బాధ్యతలు నిర్వహించేది ఎవరో తెలుసా? తెలుగు వ్యక్తులే! ఈ పదవికి ఆ ప్రాంతంలో ఒక తెలుగు వ్యక్తి ఎంపిక కావడం కూడా ఇదే తొలిసారి!!

గుంటూరు జిల్లా కొల్లావారిపాలెం కి చెందిన కొల్లా సుబ్బారావు అమెరికాలోని రిపబ్లికన్‌ పార్టీ వర్జీనియా ప్రతినిధిగా ఎన్నికయ్యారు. నవంబర్‌ లో జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తరపున ఆయన వర్జీనియా ప్రాంతంలో ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇదే క్రమంలో మరో పవాస తెలుగు ప్రముఖుడు చింతల బాలరాజు కూడా క్లీవ్‌లాండ్‌లో జరుగుతున్న రిపబ్లికన్‌ పార్టీ జాతీయ మహాసభలకు ప్రత్యామ్నాయ ప్రతినిధిగా ఎన్నికయ్యారు. పార్టీకి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన ఇండియానా గవర్నర్‌ మైక్‌ పెన్స్‌ - ఇండియానా రాష్ట్ర రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడు జెఫ్‌ కార్డ్‌ వెల్‌ లు రాజును ఈ పదవిలో నియమించారు. ఈ స్థాయిలో ఇద్దరు తెలుగువారు ఈసారి జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతున్నారు!
Tags:    

Similar News