కాంగ్రెస్ పార్టీ అన్నా.. ఆ పార్టీ అధినాయకత్వం అన్నా తీవ్రస్థాయిలో విరుచుకుపడే బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి చేదు అనుభవం ఎదురైంది. కాన్ఫూర్ లోని నవాబ్ గంజ్ లోని కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన్ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఆయన ప్రయాణిస్తున్న కారుపై దాడికి దిగారు. టమోటాలు.. కోడిగుడ్లను విసిరారు. నల్లజెండాలు ప్రదర్శించారు. నల్ల ఇంకు చల్లి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. గ్లోబల్ టెర్రరిజం మీద జరిగే సెమినార్ కు హాజరుకావాల్సిన స్వామికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చెలరేగిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులపైనా తమ ప్రతాపాన్ని ప్రదర్శించినట్లు చెబుతున్నారు.
పరిస్థితి అదుపుతప్పుతుందన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి.. కాంగ్రెస్ కార్యకర్తల గుంపును తరిమి కొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. తాజా పరిణామం స్వామికి షాకింగ్ అనటంలో ఎలాంటి సందేహం లేదు.