కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి - బీజేపీకే చెందిన సుబ్రహ్మణ్యస్వామికి ఎందుకు పొసగదో తెలియదు కానీ.. ఏమాత్రం అవకాశం దొరికినా జైట్లీని ఇరికించాలని స్వామి ట్రయ్ చేస్తుంటారు. గతంలో జైట్లీపై ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. అసలు జైట్లీ ఆర్థిక మంత్రిగా పనికిరారని కూడా ఆయన ఆరోపించారు. మొత్తం ఆర్థిక శాఖ మీద ఆరోపణలు గుప్పించారు. ఆ తరువాత బీజేపీ పెద్దలు కల్పించుకోవడం కొద్దికాలంగా ఆయన జైట్లీ జోలికి పోలేదు. అయితే.. తాజాగా మరోసారి స్వామి ఆరోపణలకు దిగారు.. ఈసారి మరింత సంచలన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఆర్థిక మంత్రి జైట్లీ మాజీ ఆర్థిక మంత్రి - కాంగ్రెస్ నేత చిదంబారానికి బాగా సాయం చేస్తున్నారన్నది స్వామి లేటెస్టు ఆరోపణ.
చిదంబరం - స్వామిలది ఒకే రాష్ట్రం... వేర్వేరు పార్టీల్లో ఉన్న ఇద్దరి మధ్య పొసగదు. అదేసమయంలో సొంత పార్టీకి చెందిన జైట్లీతోనూ స్వామికి స్పర్థలున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు శత్రువులను ఒకేసారి టార్గెట్ చేసి స్వామి రఫ్ఫాడిస్తున్నారు. దీంతో మరోసారి బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగాల్సిన అవసరం కనిపిస్తోందని అంటున్నారు.
చిదంబరం - ఆయన కుమారుడు కార్తీ చిదంబరం సాగించిన ఆర్థిక నేరాలు బయటకు రాకుండా జైట్లీ తొక్కిపెడుతున్నారని స్వామి అంటున్నారు. ఆర్థిక మంత్రిత్వశాఖ మీద కన్నువేసిన స్వామి అరుణ్ జైట్లీ పతనమే టార్గెట్ గా పెట్టుకున్నారని ఢిల్లీ పాలిటిక్సులో టాక్. మరి.. స్వామి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/