టాటాలపై నల్లధనం మరక

Update: 2017-12-16 17:15 GMT
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాటా సన్స్‌ డైరెక్టర్లలో చాలా మంది పేర్లు పనామా పేపర్లలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. వారందరి పేర్లనూ బయటపెట్టడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు.
    
కాగా ఇతర దేశాల్లో దాచుకున్న నల్ల ధనం, షెల్ కంపెనీలకు సంబంధించిన వివరాలను పనామా పత్రాలు గతంలో బయటపెట్టాయి. అప్పట్లో చాలామంది పేర్లు అందులో వచ్చాయి. పనామా పేపర్ల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. అవినీతి ఆరోపణల క్రమంలో.. ప్రభుత్వ పదవులు చేపట్టకుండా ఆయనపై ఆ దేశ సుప్రీంకోర్టు నిషేధం విధించింది.
    
అయితే... సుబ్రమణ్య స్వామి మాటల్లో నిజమెంత అన్నదానిపైనా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక సంచలనం కోసం చేసిన విమర్శలని పలువురు కొట్టిపారేస్తున్నారు. ఇటీవల ప్యారడైజ్ పత్రాల్లో జగన్ పేరుందంటూ తొలుత టీడీపీ నేతలు ఆరోపించడం, తరువాత సైలెంటయిపోవడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. సుబ్రమణ్య స్వామి ఆరోపణలూ అలాంటివే కావొచ్చంటున్నారు.
Tags:    

Similar News