టీటీడీ కీలక నిర్ణయం, బాబు టార్గెట్ గా సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు !
కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు, దాతల నుంచి విరాళలు, కానుకల రూపంలో అందే నిధులు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. టీటీడీ నిధులు దుర్వినియోగమౌతున్నాయని, పక్కదారి పడుతున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏటా వందల కోట్ల రూపాయల మేర ఆదాయం అందుతుంటుంది. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు, హుండీ ఆదాయం, టికెట్లు, ప్రసాదాలను విక్రయించడం ద్వారా వచ్చే రాబడి కోట్ల రూపాయల మేర ఉంటుంది. ఈ మొత్తాన్ని ధర్మాక కార్యకలాపాల కోసమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. సామాజిక బాధ్యత కింద ఆసుపత్రులు, విద్యా సంస్థల నిర్వహణకూ నిధులను కేటాయించే వీలు ఉంది.
అయితే, దీనికి భిన్నంగా రాజకీయ ప్రయోజనాల కోసం కూడా టీటీడీ నిధులను వినియోగించుకున్నరంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో టీటీడీ నిధుల వినియోగంపై కాగ్ దర్యాప్తుకు అనుకూలంగా పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం తో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనాల్లో డిక్లరేషన్ చర్చపై బాబు అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అందులో భాగంగానే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడూ ఏ మతస్తుడు అన్నది గుర్తించడం కష్టమని, భక్తుడు తనకు తాను చెబితే గానీ ఆ విషయం తెలీదని టీటీడీ ఛైర్మన్ మాట్లాడారని సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు.