వైఎస్ జగన్ కు బీజేపీ ఎంపీ కృతజ్ఞతలు!

Update: 2020-09-03 07:00 GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఫిదా అయ్యారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయించాలన్నది గొప్ప నిర్ణయమని సుబ్రహ్మణ స్వామి పేర్కొన్నారు.

కాగా టీటీడీని కాగ్ తో ఆడిట్ చేయించడంపై బీజేపీ ఎంపీ తాజాగా సీఎం వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీటీడీలో నిధుల వ్యయాన్ని కాగ్ తో ఆడిటింగ్ చేయించడంతోపాటు ఇక ముందు కూడా ఇలాగే చేయాలని కోరుతూ సత్యపాల్ సబర్వాల్ తో కలిసి సుబ్రహ్మణ్యస్వామి గతంలో హైకోర్టులో పిటీషన్ చేశారు.

ఈ క్రమంలోనే 2020-21 టీటీడీ ఆదాయ వ్యయాలను కాగ్ తో ఆడిట్ చేయించాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. సీఎం జగన్ దీనికి సమ్మతించడంపై బీజేపీ ఎంపీ హర్షం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News