ఎవరీ సుధారెడ్డి? ఎందుకంత హాట్ టాపిక్ గా మారారు?

Update: 2021-09-16 03:09 GMT
ఉన్నత కుటుంబాలకు మాత్రమే సుపరిచితమైన ఆమె.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అందరికి పరిచయస్తురాలిగా మారిపోయారు. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన ఆమె.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఆమె మీద అంతులేని ఆసక్తి వ్యక్తమవుతోంది. దీపికా పదుకొనే.. ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ హీరోయిన్లు.. ఇషా అంబానీ లాంటి అత్యుత్తమ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన వారు మాత్రమే పాల్గొనే ‘షో’లో ఆమె తళుక్కుమనటమే కాదు.. ఆమె ధరించిన భారీ గౌన్ ఇప్పుడు పెను సంచనలంగా మారింది.

బాలీవుడ్ సెలబ్రిటీలకు ఏ మాత్రం తగ్గని ఆకర్షణను సొంతం చేసుకున్న ఆమే సుధారెడ్డి. ఇంతకీ ఆమె ఎవరు? ఎందుకింత హాట్ టాపిక్ అంటే.. అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నుడిగా ఎదిగిన పారిశ్రామికవేత్త మేఘా  కృష్ణారెడ్డి సతీమణినే ఈ సుధారెడ్డి. అంతేకాదు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు డైరెక్టర్ కూడా. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులో మెగా సంస్థ కీలకమన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాజెక్టులు మెగా సంస్థ చేపట్టటం తెలిసిందే.అగ్ర రాజ్యమైన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన మెట్ గాలా 2021 మెగా ఫ్యాషన్ ఈవెంట్ లో ఆమె పాల్గొన్నారు.

వివిధ దేశాల నుంచి పలువురు సౌందర్యరాశులు పాల్గొన్న ఈ ఈవెంట్ లో మన దేశం తరఫున సుధారెడ్డి ఒక్కరు మాత్రమే పాల్గొనే అవకాశం దక్కింది. దీనికి తగ్గట్లే.. మిగిలిన వారంతా తన వైపు ఒక్కసారి చూసేలా.. ఆమె ధరించిన భారీ గౌన్ను డిజైన్ చేశారు. తాజాగా ఆమె పేరు అన్నిచోట్ల మారుమోగిపోతోంది. అంతర్జాతీయ వేదిక మీద తళుక్కుమన్న ఆమె ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు.

ఆమె ధరించిన భారీ గౌను.. అమెరికా జాతీయ పతాకాన్ని పోలిన రంగులతో బంగారు రంగులతో ప్రత్యేకంగా డిజైన్ చేవారు. ఈ ఏడాది థీమ్ అయిన అమెరికా ఇండిపెండెన్స్ కు తగ్గట్లు.. ఆ దేశ జాతీయ పతాకంలోని రంగుల్ని తలపించేలా డిజైన్ చేశారు. ఈ గౌను ధరించిన ఆమెకు మాత్రమే కాదు.. దాన్ని డిజైన్ చేసిన భారతీయ ఫ్యాషన్ డిజైనర్ ఫల్గుని..షేన్ పీకాక్ గురించి కూడా ఆరా తీస్తున్నారు.  ఈ గౌను తయారీకి ఏకంగా 250 గంటలు పట్టినట్లు చెబుతున్నారు.

ప్రత్యేక హంగులతో సిద్దం చేసిన ఈ గౌనులో సుధారెడ్డి ఒక్కసారిగా మెరిసిపోయారు. అందరి చూపు ఆమె మీద పడటమే కాదు.. మొదటిసారి పాల్గొని అందరి అటెన్ష్ పొందటంలో ఆమె సక్సెస్ అయ్యారు. ఈ మెగా ఈవెంట్ లో రెడ్ కార్పెట్ పైన ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సెలబ్రిటీలు తమ హోయలతో ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఆర్ట్.. ఫ్యాషన్ అంటే ఆసక్తిని ప్రదర్శించే ఆమె..  బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆసూయ పడేంత ఆకర్షణతో ఆమె ఆకట్టుకున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News