సుజనా చౌదరి.. టీడీపీకి, బీజేపీకి ఎంత మార్పు?

Update: 2019-10-18 13:27 GMT
తెలుగుదేశం పార్టీలో ఉన్నంత సేపూ కూడా ఆయన పక్కా బిజినెస్ మ్యాన్ లా నే ఉండేవారు. చాలా మంది తెలుగుదేశం నేతల్లా పచ్చ చొక్కాలు వేసుకోవడం, పచ్చ కండువాలు కప్పుకుని కనిపించడం వంటివి చేసేవారు కాదు. చంద్రబాబునాయుడుని కలిసినప్పుడు కూడా పక్కా బిజినెస్ మ్యాన్ లుక్ లో కనిపించేవాడు. ఎక్కడా పచ్చచొక్కాలా కనిపించేవాడు కాదు. పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనేది కూడా ఉండేది కాదు.

ఎంతసేపూ ఢిల్లీ వ్యవహారాలు, చంద్రబాబును కలవడం అన్నట్టుగా మాత్రమే కనిపించేవాడు.  అంతకు మించి పార్టీ తరఫున పూసుకుని పని చేసింది ఏమీ లేదు. అయితే కొన్నాళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ నేతగా మారిన సుజనా చౌదరి తీరులో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తూ ఉంది. బీజేపీ తరఫున ఆయన చాలా పనులే చేసేస్తూ ఉన్నారు

తన లుక్ లో చాలా మార్పే  చూపిస్తూ ఉన్నారు. ఏపీలో ఎప్పుడు కనిపించినా మెడలో కాషాయం కండువా ఉంటుంది పార్టీ కార్యక్రమాల్లో తెగ  పాల్గొంటున్నారు. పార్టీ తరఫున ర్యాలీలు, యాత్రలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతే కాకుండా..  పార్టీ సభ్యత్వం పుస్తకంతో కృష్ణా జిల్లాలో తిరుగుతూ.. తనకు కనిపించిన వారికి సభ్యత్వాలు కూడా ఇస్తున్నారు!

తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులూ సుజనా చౌదరి ఎప్పుడూ ఇలాంటి పనులు పెట్టుకోలేదు. ఈ విషయంలో పార్టీ శ్రేణులే ఆయనను  విమర్శించేవి. పక్కా వ్యాపారస్తులు అయిన వారికే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని, కష్టపడే వాళ్లకు కాకుండా కాలర్ కూడా నలగని వారికే చంద్రబాబు నాయుడు పదవులు ఇస్తున్నారనే విమర్శలు వచ్చేవి. అయినా సుజనా చౌదరి జడిసేవారు కాదు. ప్యూర్ లాబీయిస్టులా వ్యవహరించేవారు.

అయితే ఇప్పుడు బీజేపీ తరఫున ఆయన  పక్కా కార్యకర్తలా వ్యవహరిస్తూ ఉన్నారు. పార్టీ యాత్రలు చేస్తూ ఉన్నారు. సభ్యత్వ  నమోదు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు? అంటే.. బీజేపీ పట్ల తన విధేయతను నిరూపించుకునేందుకే అంటున్నారు పరిశీలకులు.

అసలే ఆయన బీజేపీలో చేరక ముందు సీబీఐ, ఈడీ ఆఫీసుల చుట్టూ తిరిగారు. కమలం పార్టీలోకి చేరి ఆశ్రయం పొందుతూ ఉన్నారు. కొన్నాళ్లకు ఆయన రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియవచ్చు. లేదా ఇప్పుడే మోడీ మంత్రివర్గంలో ఏమైనా అవకాశం ఉంటుందా? అనే ప్రయత్నాలూ ఆయన కొనసాగిస్తూ ఉండవచ్చు..అందుకే రాజ్యసభ సభ్యత్వం కొనసాగాలన్నా, లేదా కేంద్రంలో తన పరపతి పెరగాలన్నా.. ఇలా కష్టపడాల్సిందే అని సుజనా చౌదరి భావిస్తున్నట్టున్నారని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News