తెలుగుదేశం పార్టీ ఎంపీ - కేంద్ర శాస్త్ర - సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై సత్యనారయణ చౌదరి ముద్దుగా సుజనా చౌదరి ఏపీకి ప్రత్యేక హోదాపై మరోమారు స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నంపై ఆయన స్పందిస్తూ... ఏపీ బాధ్యత తనదేనని ప్రధాని మోడీ మాట ఇచ్చినందున ఇక నిరసనలు ఉండవని తెలిపారు. కేంద్రంపైనే భారం ఉందని, బాధ్యత కూడా ఉందని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదాపై తెలిసో - తెలియకో ఇచ్చిన హామీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. నయానో - భయానో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన సుజనా చౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా చూడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ - ఉనికిని కాపాడుకునేందుకే ప్రైవేటు బిల్లును పెట్టిందని విమర్శించారు. హోదాపై టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నపుడు 44 మంది కాంగ్రెస్ సభ్యులు కూడా మద్దతు ఇచ్చివుంటే కేంద్ర ప్రభుత్వం కాస్త లొంగేదన్నారు. ప్రతిపక్షాలు బంద్ లు - ఆందోళనలు రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నిధులను మంజూరు చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సుజనా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే ఆలస్యమైందని - కేంద్ర నిధులతోనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. జీఎస్ టీ బిల్లు ఆమోద సమయంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా అంశాన్ని జోడించి ఉంటే బాగుండేదన్నారు. బిల్లును రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లోక్ సభకు రిఫర్ చేసినపుడు తను బల్లలు చరిచాననేది అబద్దపు ప్రచారమని సుజనా ఖండించారు.