సీనియర్ హీరో సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఒకానొక సమయంలో చిరంజీవి.. బాలకృష్ణ వంటి తెలుగు స్టార్ హీరోల కు పోటీగా నిలిచాడు. అనుకోని కారణాల వల్ల సినిమా కెరీర్ టర్న్ తీసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టు గా కూడా ఎన్నో సినిమాలు చేసి అరుదైన ఘనత దక్కించుకున్నాడు సుమన్.
సినిమాల్లో నటిస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎప్పుడూ కూడా వార్తల్లో నిలిచే సుమన్ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో ఒక కార్యక్రమానికి హాజరు అయ్యాడు. ఆ గ్రామంలో కాపునాడు అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస తాతాజీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు.
ఆ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్నట్లుగా పేర్కొన్నాడు. అంతే కాకుండా తాను బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించాడు. వర్షాలు విపత్తులు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. వాటిని ముందస్తుగానే ఊహించి వాటికి తగ్గట్లుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుమన్ పేర్కొన్నాడు.
అన్నదాత ఆనందంగా ఉంటేనే దేశం బాగుంటుంది. రైతులు కోరుకునేది కొంచమే అని.. అయినా కూడా ఇప్పటి వరకు రైతుల కోసం ఏ ప్రభుత్వం కూడా సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకోలేదు అంటూ సుమన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమన్ రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ తరపున ఆయన పోటీ చేస్తారా లేదంటే ప్రచారానికే పరిమితం అవుతారా అనేది చూడాలి.